ఛార్మి ఏ వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే
TeluguStop.com
హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కెరియర్ ని కొనసాగించిన ఛార్మి( Charmy Kaur ) ప్రస్తుతం పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )తో కలిసి నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసి ఆ నిర్మాణ సంస్థ లో వరుసగా సినిమాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.
నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న చార్మి ఇంకా కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది.
"""/" / నిర్మాత గా మారిన తర్వాత సినిమాల్లో కనిపించేందుకు ఛార్మి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
పూరికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రొడక్షన్ కి సంబంధించిన పనులు చూసుకోవాలని ఆమె భావిస్తోంది.
చార్మి 2001 సంవత్సరంలో నీ తోడు కావాలి( Nee Thodu Kavali ) అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగిందట.ఒక రోజు ముంబై లో ఛార్మి ని చూసిన ఒక సినిమా వ్యక్తి సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపించాడట.
ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడు.అప్పటికి ఛార్మి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే.
"""/" /
చిన్న వయసు అవ్వడంతో ఆమె తల్లిదండ్రులు మరి కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో చేయిస్తామంటూ మొదట చెప్పారట.
కానీ ఆ తర్వాత ఛార్మి తల్లిదండ్రులు కొన్ని కండిషన్స్ పెట్టి తమ కూతురుని సినిమా లో నటింపజేశారు.
చదువుకుంటున్న ఛార్మి సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్ కి హాజరు అవుతుందని, షూటింగ్ సమయంలో మాత్రమే తాను సెట్ లో ఉంటాము అని ఆమె తల్లిదండ్రులు కండిషన్ పెట్టి మరి మొదటి సినిమా చేయించారు.
కేవలం 14 సంవత్సరాల వయసు లో ఛార్మి హీరోయిన్ గా నటించింది.ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంట్రీ అన్నట్లుగా ఉంది పరిస్థితి.
ముందు ముందు పరిస్థితి మరింతగా మారుతుందో చూడాలి.ఇక ఛార్మి విషయానికి వస్తే నాలుగు పదుల వయసుకి చేరువవుతుంది.
మొదటి సినిమా లో కంటే ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.
ముందు ముందు ఛార్మి మరిన్ని సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కోరుకుంటూ ఉన్నాం.
ఛార్మి పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమెకు మీ తరఫున.మా తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నాగచైతన్య నాని కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్…. ఏంటో తెలుసా!