Heroine Ashwini: 100కు పైగా సినిమాలలో నటించిన నటి.. కానీ ఆఖరి రోజుల్లో డబ్బు లేకపోవడంతో అలా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేక రోడ్లపై పడుకొని కొంతమంది సెలబ్రిటీలు అయితే ఎవరూ లేని అనాధలుగా కూడా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు.
గతంలో ఒక వెలుగు వెలిగిన చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఆ తరువాత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న వారు చాలా మంది ఉన్నారు.
పెద్ద పెద్ద తారలు చివరకు ధీన స్థితిలో తనువు చాలించిన సందర్భాలు ఉన్నాయి.
"""/" /
ఇదే రీతిలో అలనాటి తార మహానటి సావిత్రి ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఊహించని విధంగా కష్టాలపాలైంది.
ఇక మరో తెలుగింటి హీరోయిన్ సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి ఆఖరికి చికిత్సకు డబ్బుల్లేక ధీన స్థితిలో మరణించింది.
వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు నటి అశ్విని.( Heroine Ashwini ) ఆమె ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈమె హీరోయిన్ గా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించింది.
తెలుగులో భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి వెంకటేశ్‌తో కలియుగ పాండవులు,( Kaliyuga Pandavulu ) రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్ మాస్టర్,( Station Master ) రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి చిత్రాలతో పాటు చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది.
"""/" /
అయితే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి అశ్విని రహస్యంగా పెళ్లి చేసుకుని చిక్కుల్లో పడింది.
పెళ్లైన కొంతకాలానికే భర్త విడిచిపెట్టి వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయింది.ఒంటరిగా ఉన్న ఆమె కార్తీక్( Karthik ) అనే బాబును దత్తత తీసుకుని పెంచుకుంది.
ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే ఆమె ఆనారోగ్యానికి గురయ్యింది.ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె ఆస్తులను కూడబెట్టుకోలేదు.
ఆర్థిక కష్టాలను అనుభవించింది.వైద్య చికిత్సల కోసం చెన్నైలో ఉన్న ఇళ్లును కూడా అమ్మేసి అద్దె ఇంట్లో కాలం వెల్లదీసింది.
పోనుపోను ఆరోగ్యం మరింత క్షీణించి 2012 సెప్టెంబర్ 23న నటి అశ్విని తుదిశ్వాస విడిచింది.
విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోంది