కరోనాను తరిమికొట్టే చిట్కాలు చెప్పిన అనుష్క!

దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల గత కొన్ని నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి.

దీంతో అనుష్క ప్రధాన పాత్రలో మాధవన్ హీరోగా తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

అయితే బయట నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పట్లో థియేటర్లు తెరిచినా ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే అవకాశాలు తక్కువ.

అందువల్ల నిశ్శబ్దం మూవీ మేకర్స్ తమ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుష్క సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.

దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి విషయంలో అనుష్క కీలక సూచనలు చేశారు.

యోగా ద్వారా కరోనాను అడ్డుకోవచ్చని తాను చెప్పలేనని కానీ యోగా మానసికంగా ధృడంగా ఉండటానికి సహాయపడుతుందని అనుష్క చెప్పుకొచ్చారు.

కరోనా బారిన పడ్డ వారిలో ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయని.ఎవరైతే యోగాలో శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తారో వాళ్లు వైరస్ బారిన పడినా త్వరగా కోలుకుంటారని తెలిపారు.

ప్రతిరోజూ 60 నిమిషాల పాటు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని.యోగా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని అన్నారు.

ఊపిరితిత్తులను బలంగా మార్చడంలో, శ్వాస ప్రక్రియను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని వెల్లడించారు.నిశ్శబ్దం సినిమా కథ తనకు ఎంతగానో నచ్చిందని దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ఆమె అన్నారు.

నిశ్శబ్దం సినిమా ప్రజలకు ఒక మంచి మూవీ చూశామనే అభిప్రాయాన్ని తప్పక కలిగిస్తుందని పేర్కొన్నారు.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

ఓటీటీ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటూ ఉండటంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అని ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

కుక్కను బ్రిడ్జి దాటించిన వ్యక్తి.. దాని రియాక్షన్ చూస్తే ఫిదా..??