వరుస సక్సెస్ లతో పారితోషికం పెంచేసిన అనుపమ.. ఎన్ని రూ.కోట్లంటే?

2022 సంవత్సరంలో హ్యాట్రిక్ విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అనుపమ 2023 సంవత్సరంలో కూడా కూడా వరుస ఆఫర్లతో బిజీ కావడంతో పాటు వరుస సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రాజెక్ట్ లకు అనుపమ 60 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారు.

అయితే తర్వాత ప్రాజెక్ట్ లకు మాత్రం ఈ హీరోయ్న్ కోటీ 20 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తున్నారని బోగట్టా.

అనుపమకు గతంతో పోలిస్తే ఆఫర్లు ప్రస్తుతం తగ్గాయి.అందం, అభినయం విషయంలో లోటు లేకపోయినా స్టార్ హీరోలు అనుపమకు ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు.

అయితే వరుస సక్సెస్ లతో గోల్డెన్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న అనుపమకు 2023 సంవత్సరం కూడా కెరీర్ పరంగా ప్లస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నిఖిల్ అనుపమ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.ఈ కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

కార్తికేయ2 సినిమాలో అనుపమ రోల్ పరిమితమే అయినా తన పాత్రకు అనుపమ నూటికి నూరు శాతం న్యాయం చేశారని కామెంట్లు వినిపించాయి.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే అనుపమ కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/"/ హీరోయిన్ గా వివాదాలకు దూరంగా ఉంటూ అనుపమ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

అనుపమ సోషల్ మీడియాలో గతంలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి గ్లామర్ రోల్స్ కూడా అద్భుతంగా చేయగలననే అభిప్రాయాన్ని కలిగించారు.

పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుపమ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

అనుపమను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

నార్నే నితిన్ నితిన్ కి ఎన్టీయార్ ఏం చెప్పాడు…