ఆ విషయంలో నన్ను అబ్బాయిలా చూశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా అమృతా అయ్యర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన అమృతా అయ్యర్ తర్వాత రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్ సినిమాల ద్వారా అమృతా అయ్యర్ కు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.

అమాయకురాలి పాత్రల్లో అమృతా అయ్యర్ బాగా నటిస్తారని ప్రేక్షకుల్లో భావన ఉంది. """/" / అమృతా అయ్యర్ నటించిన అర్జున ఫల్గుణ ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని అమృతా అయ్యర్ వెల్లడించారు.

ఈ సినిమాలో శ్రావణి అనే పాత్రలో తాను నటిస్తున్నానని అమృత చెప్పుకొచ్చారు.ఒక అమ్మాయిగా ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తానని ఆమె చెప్పారు.

శ్రీవిష్ణును మొదట చూసి రిజర్వ్డ్ పర్సన్ అనుకున్నానని ఆ తర్వాత శ్రీవిష్ణు మంచి ఫ్రెండ్ గా మెలిగాడని అమృతా అయ్యర్ చెప్పారు.

దర్శకుడు స్పూర్తి నింపి ఈ సినిమా చేయించాడని ఆమె పేర్కొన్నారు.నలుగురు అబ్బాయిల మధ్య నన్ను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా చూశారని అమృతా అయ్యర్ పేర్కొన్నారు.

గత సినిమాలలో పాత్రల విషయంలో సంతృప్తితో ఉన్నానని అమృతా అయ్యర్ చెప్పుకొచ్చారు. """/" / గ్లామర్ రోల్స్ తనకు ఇష్టం లేదని ఛాలెంజింగ్ రోల్స్ ను మాత్రం తాను ఇష్టపడతానని అమృతా అయ్యర్ వెల్లడించారు.

తాను చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగానని సంవత్సరం పాటు కార్పొరేట్ కంపెనీలో పని చేశానని అమృతా అయ్యర్ పేర్కొన్నారు.

తనకు బన్నీ, సమంత ఇష్టమని తెలుగు నేర్చుకుంటున్నానని అమృతా అయ్యర్ అన్నారు.హనుమాన్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నానని వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని అమృతా అయ్యర్ చెప్పుకొచ్చారు.

ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ ఎప్పుడు వెళ్తుందో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి…