Chiranjeevi : చిరంజీవిని నా తమ్ముడిగా అస్సలు ఊహించుకోలేను.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి ఆమని( Actress Amani ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగులో ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
అయితే ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన ఆమె ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవలె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో తల్లి అత్త పిన్ని వంటి పాత్రలో నటిస్తూ అలరిస్తోంది.
ప్రస్తుతం ఆమని చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. """/" /
కాగా ఆమని 90 వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులతో ఆమని ఒకరు.
జంబలకిడి పంబ, శుభలగ్నం, మావిచిగురు, మిస్టర్ పెళ్ళాం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆమని గుర్తింపు సొంతం చేసుకుంది.
చాలా మంది స్టార్స్ తో కలసి నటించిన ఆమనికి కెరీర్ లో ఒక లోటు అలాగే ఉండిపోయిందట.
తన డ్రీమ్ హీరో మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ రాలేదని ఆమని అంటోంది.
తాజాగా ఇంటర్వ్యూలో ఆమని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.చిరంజీవితో( Chiranjeevi ) రాక రాక నటించే ఛాన్స్ వస్తే అది కాస్త మరో హీరోయిన్ వల్ల చేజారిందని ఆమని తెలిపింది.
రిక్షావోడు ( Rickshavodu )చిత్రంలో ముందుగా నన్ను ఎంపిక చేశారు.ఆ చిత్రంలో నా బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య కూడా హీరోయిన్.
"""/" /
దీనితో నాకు చాలా సంతోషంగా అనిపించింది.కానీ సడెన్ గా ఒక రోజు పేపర్ లో నగ్మాని హీరోయిన్ గా తీసుకున్నారని చదివాను.
అప్పుడు మా మేనేజర్ ని అడిగితే.అవును మేడమ్.
మనకి ఛాన్స్ లేదు.డైరెక్టర్ మారారు.
అందుకే ఆమెని తీసుకున్నారు అని చెప్పాడు.ఆ చిత్రానికి ముందుగా డైరెక్టర్ కోందండ రామిరెడ్డి గారు.
కొన్ని కారణాల వల్ల ఆయన మరో చిత్రానికి వెళ్లాల్సి వచ్చింది.దీనితో కోడి రామకృష్ణ గారు రిక్షావోడు చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
ఆ విధంగా ఛాన్స్ పోయింది.దీనితో నేను వెక్కి వెక్కి ఏడ్చానని ఆమని పేర్కొంది.
అది నాకు హార్ట్ బ్రేకింగ్ లాంటిది.ఆ గాయాన్ని ఇక ఏది పూడ్చలేదు.
నా లైఫ్ లో అది ఒక లోటుగా ఉండిపోయింది అని ఆమని పేర్కొంది.
మరో ఊహించని సంఘటన కూడా జరిగిందట.చిరంజీవికి సిస్టర్ గా నటించే అవకాశం వచ్చిందట.
ఆ మూవీ మరేదో కాదు మురుగదాస్ డైరెక్ట్ చేసిన స్టాలిన్ చిత్రం.ఆ చిత్రంలో చిరంజీవికి తాను అక్కగా నటించాలి.
ముందుగా నన్ను అడిగితే.ఆయన నా డ్రీం హీరో.
కలలో కూడా చిరంజీవి గారిని నా తమ్ముడిగా ఊహించుకోను.అలాంటిది సిస్టర్ గా ఎలా చేస్తాను కుదరదని చెప్పేసిందట.
పది సార్లు ఫోన్ చేసి అడుక్కున్నారు.తాను ఒప్పుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసిందట ఆమని.
100 కోట్ల క్లబ్బులో అక్కినేని నాగచైతన్య.. అక్కినేని హీరోల రేంజ్ పెరిగినట్టేనా?