ఇస్మార్ట్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్.. తారక్ మూవీలో ఛాన్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది.

ఈ కాంబినేషన్ లో పొలిటికల్ సబ్జెక్ట్ తో ఒక సినిమా తెరకెక్కనుంది.సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా ఎన్టీఆర్ ఇప్పటివరకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో నటించలేదు.

"""/"/ ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నారని వస్తున్న వార్తల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నభా నటేష్ నటిస్తోందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.ఫస్ట్ హీరోయిన్ గా ఎవరు ఎంపికైనా సెకండ్ హీరోయిన్ గా మాత్రం నభా నటేష్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫస్ట్ హీరోయిన్ గా మాత్రం కియారా అద్వానీ లేదా రష్మిక మందన్నలలో ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ తో ఛాన్స్ అంటే నభా నటేష్ ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు ఉంటాయి.

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ కెరీర్ లో విజయాలు ఉన్నా ప్రేక్షకుల్లో ఈమెకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.

అయితే నభా నటేశ్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులు చేస్తున్నారని సమాచారం.జూన్ నాటికి ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్.. బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!