చైనీస్ ఫుడ్ ను ఓ పట్టు పట్టిన బుట్ట బొమ్మ..!
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలుగులోనే మాత్రమే కాకుండా హిందీలో కూడా తన మార్క్ సినిమాలను చేస్తూ భారీగా సంపాదిస్తోంది.
టాలీవుడ్లో ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే మళ్లీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత బాలీవుడ్ లో ఎంటర్ ఇచ్చి అక్కడ కాస్త బెడిసికొట్టడంతో మళ్లీ టాలీవుడ్కి ఎంట్రి ఇచ్చింది.
ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ బుట్ట బొమ్మ.
టాలీవుడ్ లోని బడా హీరోల సరసన ఒక్కొక్కరి పక్కన నటిస్తూ టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది.
వరుసగా ప్రతి సినిమా హిట్ సాధిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది.
కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా తన అభిమానులను ఇట్లే ఆకట్టుకుంటుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే.ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ హీరో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీలో బిజీబిజీగా గడిపేస్తున్నారు.తన బర్త్డే కూడా అక్కడే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది ఈ భామ.
అయితే తాజాగా వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఆవిడ ఓ పోస్ట్ చేసి నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఇందుకు సంబంధించిన పోస్టులో ఆవిడ ఒక ప్లేటు నిండా చైనీస్ ఫుడ్ ను పూర్తిగా నింపేసింది.
పూజ హెగ్డే చూడడానికి అంత సన్నగా, ఫిట్ గా ఉండే ఆవిడ అంత ప్లేట్ ను పూర్తిగా లాగించేసిన తర్వాత ఖాళీగా ఉన్న ప్లేట్ ను కూడా చూపిస్తూ పోస్ట్ చేసింది ఈ భామ.
ఇకపోతే, ఈవిడ కూడా అప్పుడప్పుడు తాను చేస్తున్న వర్కౌట్స్, యోగాసనాలు కు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంటుంది.
లాక్ డౌన్ సమయం లో కూడా కొత్త రకాల వంటలు చేసి బాగా ఎంజాయ్ చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే తాజాగా ఇటలీలో ఆమె ప్లేట్ నిండా చైనీస్ వంటకాలను పెట్టుకొని ఫుల్లుగా లాగించేసింది.
అంతేకాదు ఇంకా కావాలంటూ కూడా అడిగేసింది.ఆమె పొట్ట చూస్తే కొంచెం ఉన్న.
ఫుడ్డు మాత్రం బాగానే లాగించేస్తోంది అంటూ నెటిజన్స్ ఆమె పెట్టిన పోస్టులకు కామెంట్లు చేస్తున్నారు.
డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!