13 వేల అడుగులు ఎత్తు నుండి స్కైడైవింగ్ చేసిన ముద్దుగుమ్మ!
TeluguStop.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో అందరికి తెలిసిందే, దీనితో ప్రపంచం అంతా ఇంటికే పరిమితమయ్యింది.
అయితే ఇన్ని రోజులుగా ఇంట్లోనే ఉన్న స్టార్లు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు.అందులో హలో, రణరంగం వంటి తెలుగు సినిమాల్లో కనువిందు చేసిన మలయాళీ బ్యూటీ కల్యాణి ప్రియదర్శిని కూడా ఉన్నారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సడలింపులను తొలగించిన విషయం తెలిసిందే.దీనితో ఇన్నాళ్లు ఇంట్లోనే ఉంటున్న కల్యాణి ప్రియదర్శిని దుబాయ్ చెక్కేసారు, సుదీర్ఘ విరామం తరువాత బయట అడుగుపెట్టిన ఈ భామ తన ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అందులో భాగంగా 13వేల అడుగులు ఎత్తు నుండి స్కై డైవింగ్ చేసిందట.ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడ్తున్నాయి.ఇదిలా ఉండగా కళ్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ, ఆయా షూటింగ్ లలో బిజీ బిజీ గా ఉన్నారు.
తాను చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.మరి ఈ ముద్దుగుమ్మ చేసిన ఫీట్ పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.