కేజిఎఫ్ సినిమా ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టిన హీరో యశ్!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి  బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

ఇలా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేసింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఇకపోతే కేజిఎఫ్ సినిమా ప్రారంభించి ఇప్పటికి ఆరు సంవత్సరాలు కావచ్చింది.ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 2 ను ఏప్రిల్ 14వ తేదీ ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులను జరుపుకుంటోంది. """/" / ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా కోసం కమిటైన హీరో యశ్ తాజాగా ఆరేళ్ల కేజిఎఫ్ జర్నీకి పులిస్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈయన ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఆయన పనులన్ని పూర్తి అయినట్లు సమాచారం.

గత ఆరు సంవత్సరాల నుంచి హీరో ఒకే విధమైన బాడీ లుక్ మెయిన్ టైన్ చేస్తూ ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడ్డారు అని చెప్పవచ్చు.

ఇలా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకొని ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం కానుంది.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రేక్షకులకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభాస్..!