Vyjayanthi Movies: హిట్ సెంటిమెంట్ కోసం ఆ ఇద్దరు హీరోలను గెస్ట్ రోల్స్ కి వాడుతున్న వైజయంతి మూవీస్
TeluguStop.com
ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా బాగా క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రభాస్( Prabhas ) మాత్రమే.
అతడు నటించిన సలార్ సినిమా( Salaar ) తాజాగా 1000 కోట్ల దగ్గరగా కలెక్షన్స్ సాధించి మరోసారి తెలుగు వాడి స్టామినా యావత్ ఇండియా వ్యాప్తంగా రుచి చూపించింది.
దాంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి.మారుతి దర్శకత్వంలో రాజా సాబ్( Rajasaab ) అనే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచే విధంగా ఉంది.
అలాగే ప్రభాస్ మరోసారి మాస్ లుక్కుతో కనిపించడంతో అభిమానులంతా పండగ చేసుకున్నారు.అతని దగ్గర నుంచి ఒక భారీ పవర్ఫుల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"""/" /
అయితే ప్రభాస్ ఈ చిత్రంతో పాటు కల్కి( Kalki ) అనే మరో సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) అధినేత అశ్వినీ దత్ రెండవ కుమార్తె భర్తనే ఈ నాగ్ అశ్విన్.
( Nag Ashwin ) ఇక ఇప్పటికే మహానటి సినిమా ద్వారా నాగ్ అశ్విన్ తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు.
కాగా వైజయంతి మూవీస్ తన చిత్రాలలో నటించిన హీరోలను సెంటిమెంట్ గా వాడుకుంటుంది.
అది ఏంటంటే ఇప్పటికే తమ సినిమాలో నటించి హిట్స్ అందుకున్న హీరోలను మళ్ళీ తదుపరి సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించే విధంగా ప్లాన్ చేసుకుంటుంది.
"""/" /
ఉదాహరణకు విజయ్ దేవరకొండని( Vijay Devarakonda ) తీసుకుంటే పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకుని తను సోలో హీరోగా ఎదిగాడు కానీ అంతకు ముందు నానితో కలిసి ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు.
ఈ సినిమా విజయాన్ని సాధించింది అలాగే మహానటి చిత్రంలో( Mahanati ) కూడా మరొక చిన్న పాత్రలో నటించాడు అది కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది అందుకే కల్కి సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేయించబోతున్నారట వైజయంతి మూవీస్ వారు.
అలాగే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) కూడా మరొక చిన్న పాత్రలో కనిపిస్తున్నాడట.
ఇప్పటికే మహానటి సినిమాలో హీరోల్లో నటించిన దుల్కర్ సీతారామం సినిమాతో కూడా హిట్ హీరోగా వారి బ్యానర్ నుంచి వస్తున్నాడు.
అందుకే ఈ హిట్ అందుకున్న హీరోలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే పనిలో ఉంది వైజయంతి మూవీస్.
సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?