విశ్వక్ ఏంటీ అంత మాట అనేశాడు.. తెల్లమొహం వేసుకున్న ఉదయభాను?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిగా నటించి అందరిని మెప్పించడమేకాకుండా బుల్లితెర యాంకర్ గా సుమారు దశాబ్దన్నర కాలం పాటు బుల్లితెరపై వెండితెరపై ప్రేక్షకులను సందడి చేసిన నటి ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఉదయభాను బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో ఈమె పండంటి కవల ఆడ పిల్లలకు జన్మనివ్వడంతో తన వృత్తిపరమైన జీవితానికి కొన్ని సంవత్సరాల పాటు విరామం ప్రకటించారు.

తన పిల్లలతో పూర్తిగా తన జీవితాన్ని గడిపిన ఉదయభాను తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఉదయభాను రీ ఎంట్రీ ఇవ్వడంతో తిరిగి వరుస కార్యక్రమాలు ప్రీ రిలీజ్ వేడుకలతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యాంకర్ గా వ్యవహరించారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా ఉదయభాను పై పంచులు వేయడంతో వేదికపైనే ఉదయభాను తెల్లమొహం వేసుకుంది.

ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వక్ ను వేదికపైకి పిలుస్తూ .సినిమాల్లో కన్నా రియల్ గా చూడ్డానికి చాలా బాగుంటావ్ అంటూ తన పై ప్రశంసలు కురిపించింది.

"""/"/ ఉదయభాను ఇలా అనేసరికి విశ్వక్ ఏమాత్రం తగ్గకుండా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాను అంటూ తనకు పంచ్ వేశాడు.

అంతటితో విశ్వక్ ఆగకుండా చిన్నప్పటినుంచి మిమ్మల్ని చూడాలనే కోరిక ఉండేది ఈ రోజుతో ఆ కోరిక తీరి పోయిందని సమాధానం చెప్పగా ఉదయభాను కూడా నేను కూడా మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అంటూ తనకు రివర్స్ పంచ్ వేసింది.

ఉదయభాను ఇలా అనేసరికి విశ్వక్ మాట్లాడుతూ మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టలేదని సమాధానం చెప్పారు.

"""/"/ విశ్వక్ సేన్ ఈ ఈ విధంగా చెప్పేసరికి ఉదయభాను తెల్ల మొహం వేసుకొని మీ కన్నా నేను నాలుగు సంవత్సరాలు పెద్దదాన్ని అంటూ కవర్ చేసుకోచ్చింది.

మొత్తానికి వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా ఈ నెల 24వ తేదీ ముందుకురానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇప్పటికే రొమాంటిక్, ఆంధ్ర పోరి సినిమాలతో సందడి చేసిన ఆకాష్ తాజాగా చోర్ బజార్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి