విశ్వక్ సేన్ తో ఓటిటి సినిమాలో రకుల్..!

యువ హీరో విశ్వక్ సేన్ మంచి దూకుడు మీద ఉన్నాడు.త్వరలో పాగల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇవే కాకుండా ప్రముఖ ఓటిటి కోసం పాంథాలజీ మూవీ ఒకటి చేస్తున్నాడట విశ్వక్ సేన్.

తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఓటిటి సినిమాలో విశ్వక్ సేన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

స్టార్ హీరోలతో నటించిన రకుల్ ఈమధ్య పెద్దగా సినిమా అవకాశాలు లేక యువ హీరోలతో జత కడుతుంది.

ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో జంగిల్ బుక్ లో నటించిన రకుల్ లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తో సినిమాకు రెడీ అవుతుంది.

తెలుగులో వచ్చిన ఏ చిన్న ఆఫర్ ను వదిలిపెట్టకూడదు అనుకున్న రకుల్ యువ హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

విశ్వక్ సేన్, రకుల్ చేస్తున్న ఈ ఓటిటి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

"""/"/ హిట్ సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తన సినిమాల విషయంలో క్రేజీగా ఉన్నాడు.

వరుస సినిమాలతో దూసుకెళ్తూ అనతికాలంలోనే యంగ్ హీరోల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.సినిమాల సెలక్షన్ లో కూడా తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు విశ్వక్ సేన్.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?