అమ్మాయిగా మారాలనుకుంటున్న విశ్వక్… ఇదేం డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్!
TeluguStop.com
ఫలక్‌నూమా దాస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) .
ఇలా మొదటి సినిమాతోనే హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడుగా తన ఏంటో నిరూపించుకున్నారు అయితే ఈయన అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రతి సినిమాకు తనలో సరికొత్త వేరియేషన్ బయట పెడుతూ నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ ఉన్నారు.
ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్ పనులు జరుపుకుంటూ ఉండగా మరికొన్ని సినిమాలు స్క్రిప్ట్ ఫైనల్ చేసే షూటింగ్లకు సిద్ధమయ్యాయని తెలుస్తుంది.
"""/" /
ఇకపోతే ఈయన నటించే సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా తాజాగా ఓ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశ్వక్ హీరోగా నటిస్తున్నటువంటి ఓ సినిమాలో ఈయన అమ్మాయి( Lady Get Up ) గా మారబోతున్నారని సమాచారం.
ఈ సినిమా సెకండ్ హౌఫ్ నుంచి విశ్వక్ అమ్మాయి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాకు లీల ( Leela ) అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం.
"""/" /
ఇలా విశ్వక్ సేన్ తన సినిమాలో అమ్మాయి పాత్రలో నటించబోతున్నారన్న విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక సరికొత్త కథాంశంతో ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నారట.నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందని సమాచారం.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించకోబోతుందని తెలుస్తుంది.మరి విశ్వక్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.
అయితే విశ్వక్ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలలో నటించడం లేడీ గెటప్ లో నటించి మంచి సక్సెస్ సాధించారు.
మరి విశ్వక్ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
వాల్‌మార్ట్‌లోని వస్తువులు నేలపై పడేస్తూ రచ్చ చేసిన బాలిక.. వీడియో చూస్తే షాకే..