పునీత్ చేసిన మంచిపనుల్లో ఒక్కటి నేను చెయ్యాలనుకున్న.. విశాల్ కామెంట్స్ వైరల్?

హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా హీరో విశాల్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం విశాల్ మాట్లాడుతూనాలుగు సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను.కాలి నడకన దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొన్నాను.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు అని తెలిపారు.అలాగే ఈ దీపావళికి ఎనిమీ చిత్రం విడుదల కానుంది అని తెలిపారు.

ఇక అనంతరం హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ.పునీత్ రాజ్‌కుమార్ మరణం నన్ను చాలా బాధించింది.

ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు ఉంది.అందుకే అతను చేసిన అనేక మంచి పనుల్లో నేను ఒకటి చెయ్యాలి అనుకున్నాను.

"""/"/ పునీత్‌ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు.

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు.పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు.

చివరికి తన కళ్లు కూడా దానం చేశారు.ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను.

ఒక స్నేహితుడిగా పునీత్‌ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను' అని విశాల్‌ పేర్కొన్నారు.

విశాల్‌ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియో: శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..