Vishal : రోజుకు 25 సిగరెట్లను తాగిన విశాల్ ఆ అలవాటును మానేయడం వెనుక అసలు కథ ఇదేనా? 

ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, వ్యాపారవేత్త జి.కె రెడ్డి కుమారుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు విశాల్( Vishal ).

ఈయన తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా విశాల్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.

తాజాగా విశాల్ మార్క్ ఆంటోనీ( Mark Antony ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలై కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

"""/" / ఫిదా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకున్నటువంటి ఒక చెడు అలవాటు గురించి బయటపెట్టారు తనకు సిగరెట్లు కాల్చడం చాలా అలవాటుగా ఉండేదని తెలిపారు.

కాలేజీ సమయంలోనే, ఇండస్ట్రీ ఎక్కువ వచ్చిన మొదట్లో చైన్ స్మోకర్ గా ఉండేవాడినని చెప్పుకొచ్చారు.

ఇలా సిగరెట్లు తాగుతూ వాటికి బానిసగా మారిపోయానని ప్రతి రోజుకు దాదాపు 25 సిగరెట్ల వరకు కాల్చేవాడినని తెలియజేశారు.

అయితే ఉన్నఫలంగా ఈ అలవాటు మానుకోవాలని నిశ్చయించుకున్నట్లు విశాల్ తెలిపారు. """/" / ఇలా రోజుకు పాతిక సిగరెట్లు కాల్చే నేను ఒకరోజు ఈ అలవాటు మానుకోవాలని అనుకున్నాను దీంతో లాస్ట్ సిగరెట్ ( Cigarret ) ఫ్లష్ చేసి నా స్నేహితుడికి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ అలవాటును మానేశాడు.

అయితే ఒక వ్యక్తికి ఉన్న చెడు అలవాట్ల కన్నా వారికి ఉన్న దృడ సంకల్పమే చాలా గొప్పదని ఈ సందర్భంగా విశాల్ తెలియజేశారు.

అప్పటినుంచి తన కెరియర్ పై ఫోకస్ చేసినటువంటి విశాల్ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అయితే తనకు డైరెక్టర్గా కూడా మారాలని కోరికగా ఉందని తప్పకుండా తాను డైరెక్టర్ కూడా అవుతాను అంటూ పలు సందర్భాలలో ఈయన వెల్లడించారు.

వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తున్నాడో తెలుసా..?