హీరో విశాల్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు... 15 కోట్లు కట్టాలని ఆదేశం... ఎందుకంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది.కేవలం మూడు వారాల వ్యవధిలో హీరో విశాల్ కోర్టుకు 15 కోట్ల రూపాయలను ఫిక్సిడ్ డిపాజిట్ తెరవాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేస్తూ విశాల్ కు షాక్ ఇచ్చింది.

అసలు హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు ఈ విధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా సమస్థ నుంచి విశాల్ తీసుకున్న 15 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని కోర్టు తెలిపింది.

హీరో విశాల్ లైకా సంస్థ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకుండా తన కొత్త సినిమాను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో లైకా సంస్థ హీరో విశాల్ పై పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది.

అంతేకాదు.తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.

21.69 కోట్లు ఇవ్వాలని లైకా సంస్థ పిటిషన్లో పేర్కొన్నారు.

హీరో విశాల్ ఈ పదిహేను కోట్ల ను మూడు వారాల వ్యవధిలో ప్రధాన రిజిస్టర్ పేరున బ్యాంకులో జమ చేయాలని చెప్పారు.

"""/"/ విశాల్ లైకా సంస్థతో ఒప్పందం ప్రకారం.తమకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లించకుండా "వీరమే వాగై సుడుం "సినిమా రిలీజ్ చేయడానికి ఓటీటీ శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి విశాల్ సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ముందుగా తమ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాలంటూ లైకా సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ విషయంపై విచారించిన కోర్టు తనకు 15 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీ జరపనున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ ‘దోప్‌’ సాంగ్‌ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్