ఏపీ సీఎం జగన్ పై హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఏపీలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తమిళ్ హీరో విశాల్( Hero Vishal ) ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) సంచలన లేఖలు చేశారు.
వ్యక్తిగతంగా వైయస్ జగన్ అంటే తనకిష్టమని వ్యాఖ్యానించారు.తాను ఎప్పుడు వైసీపీని ( YCP ) సపోర్ట్ చేస్తున్నట్లు ఎక్కడా తెలపలేదని అన్నారు.
జగన్ చేసే మంచి పనులను ఫాలో అవుతా.వాళ్ల తండ్రి చనిపోయిన నాటి నుంచి ప్రజలకు అనేక మంచి పనులు చేస్తూ వస్తున్నారు.
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలలో మరోసారి జగనే ముఖ్యమంత్రి అవుతారు.అలాగని నాకు ఎవరిపై కోపం లేదు.
"""/" /
ఇటీవల సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి పట్ల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
దాడులు ఆయనకి పెద్ద కొత్త ఏమి కాదు.గతంలో విశాఖపట్నం విమానశ్రయంలో కూడా దాడి జరిగింది.
రాయలసీమ నుండి వచ్చిన ఆయనకు ధైర్యం ఎక్కువ.అని అన్నారు.
ఇదే సమయంలో తన పొలిటికల్ ఎంట్రీ( Political Entry ) గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
మామూలుగా సినిమా రంగంలో రాణించే తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అని అన్నారు.
రాజకీయ నాయకులు సరిగ్గా ప్రజలని పాలించకపోవడం వల్లే.తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
2019 ఎన్నికలలో వైఎస్ జగన్ కి హీరో విశాల్ మద్దతు తెలపడం.కాగా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మరోసారి జగన్నే గెలుస్తారని విశాల్ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.
రైలు కంపార్ట్‌మెంట్‌లో ఇబ్బందికర సమస్య.. చిటికెలో ఫిక్స్ చేసిన మహిళ.. వీడియో చూస్తే..!