వరుడు, లియో సినిమాలను విశాల్ రిజెక్ట్ చేయడానికి కారణాలివేనా.. ఏమైందంటే?
TeluguStop.com
తమిళ స్టార్ హీరో విశాల్( Star Hero Vishal ) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విశాల్.
అందులో భాగంగానే విషయాలు తాజాగా నటించిన చిత్రం రత్నం.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే మీడియా ముందుకు వచ్చిన విశాల్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.
"""/"/
ఈ సందర్భంగా హీరో విషయాలు మాట్లాడుతూ.ప్రతి హీరో, నటుడు ఏదో ఒక సమయంలో ఏదో కారణం వల్ల కొన్ని సినిమాలను వదులుకోవడం జరుగుతుంది.
కొన్ని సినిమాలను కావాలని వదులుకుంటే, కొన్ని సినిమాలు డేట్లు లేక వదులుకున్న సందర్భాలు ఉంటాయి.
అలా నేను కూడా కొన్ని చేశాను.అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు( Varudu ) ఒకటి కాగా మరోటి తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో ఒకటి.
వరుడు సినిమాలో ఆర్య పోషించిన విలన్ పాత్ర( Villain Role )కు మొదట విశాల్ ను సంప్రదించారట.
ఆ సమయంలో డేట్లు కుదరక పోవడంతో నేను చేయలేదు అంటూ విశాల్ చెప్పుకొచ్చాడు.
"""/"/
లియో సినిమా( Leo Movie )లో యాక్షన్ కింగ్ అర్జున్( Arjun ) పోషించిన విలన్ పాత్రను విశాల్ తో చేయించాలని దర్శకుడు చాలా ప్రయత్నించాడట.
కానీ విశాల్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.తాజా ఇంటర్వ్యూలో లియో విషయమై స్పందిస్తూ తాను ఆ సమయంలో డేట్లు కేటాయించలేక పోవడం వల్లే నో చెప్పాను అని తెలిపారు విశాల్.
ఈ సందర్భంగా విశాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!