హీరో వినోద్ కుమార్ ఇద్దరు కొడుకులు కూడా హీరోలని మీకు తెలుసా..?

90వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమలోకి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు అందులో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకొని హీరోగా నిలబడ్డారు మరికొందరు మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ అంతలోనే ఆగిపోయారు.

మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగిన హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన కూడా నటిస్తూ డైరెక్షన్ చేసిన మామగారు సినిమా తో తెలుగులో హీరోగా పరిచయం అయ్యాడు వినోద్ కుమార్.

ఆ తర్వాత సీతారామయ్య గారి మనవరాలు లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు.

90వ దశకంలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ హిట్లు కొడుతూ ముందుకు సాగుతూ ఉంటే వినోద్ కుమార్ లాంటి హీరో మాత్రం చిన్న చిన్న సినిమాలు తీస్తూ హిట్లు కొడుతూ తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంటూ ముందుకు వెళ్ళాడు.

అయితే మొదట్లో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి కానీ తర్వాత ఆయనకు కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి దాంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు.

తర్వాత కొన్ని రోజులకి సెకండ్ ఇన్నింగ్స్ లో అక్కినేని నాగార్జున వాళ్ళ అక్క కొడుకు అయిన సుశాంత్ హీరోగా వచ్చిన కాళిదాసు సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు సాధించాడు.

సినిమా కమర్షియల్ గా యావరేజ్ గా ఆడినప్పటికీ ఆయనకు విలన్ గా మంచి పేరే వచ్చింది.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత తనకి పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి.

"""/"/ ప్రస్తుతం ఆయన ముంబైలో బిజినెస్ లు చేసుకుంటున్నారు అయితే తన దగ్గర పనిచేసిన మేనేజర్ ఒకడు తనని మోసం చేశాడని వాడిని తన ఫ్రెండ్ లారీతో డి కొట్టించి దానిని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాడు అని అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి ఈ కేసులో తను జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు ఇంకా ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది.

వినోద్ కుమార్ వాళ్ళ భార్య ఎప్పుడు బయట ఎక్కువగా కనిపించదు ఆవిడకి తన ఇల్లే ప్రపంచం వీళ్ళకి తినడానికి ఏం కావాలన్నా చేసి పెడుతుందట అలాగే వీళ్ళకి అయద, అనగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే వాళ్ల పిల్లల గురించి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎప్పటికైనా మా పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను మా పిల్లలు కూడా సినిమాలంటే చాలా ఇష్టం అని చెబుతూ ఉంటారు.

"""/"/ ఇప్పటికే వాళ్లు కరాటే,మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకున్నారని చెప్పారు అలాగే వాళ్లకి అమెరికా లోని ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు అని చెప్పారు ఎప్పటికైనా మా పిల్లల్ని పెద్ద యాక్టర్స్ గా చూడడమే నా డ్రీమ్ అని చెప్పారు.

తెలుగు సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ల పిల్లలకి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని అని చెప్పారు.

బాలకృష్ణ గారి సినిమాలు బాగుంటాయని చెప్పారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుందని తను చేసిన అన్ని సినిమాలు చాలాసార్లు చూశామని ముఖ్యంగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ లాంటి సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటన ఇంకో లెవల్లో ఉంటుందని వినోద్ కుమార్ గారి పిల్లలు ఎప్పుడూ అంటుంటారు అని ఆయన చెబుతున్నారు.

వినోద్ కుమార్ వాళ్ళ పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా సక్సెస్ అవుతారో లేదో చూద్దాం.

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘ సినిమాను నిఖిల్ అనవసరం గా చేశాడా..?