విజయవాడ నగరంలో గ్రంధాలయం చిత్ర యూనిట్ సందడి..
TeluguStop.com
విజయవాడ నగరంలో గ్రంధాలయం చిత్ర యూనిట్ సందడి చేసింది.సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన ఈ చిత్రం కచ్చితంగా యువతని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా హీరో విన్ను మద్దిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతి నగర్ లోని ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో హీరో విన్ను మద్దిపాటి మాట్లాడుతూ గ్రంధాలయం సినిమా టీజర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి చాలా చక్కటి విశేష స్పందన వస్తుందన్నదని తెలిపారు.
దర్శకుడు ఇందులో సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశారని పేర్కొన్నారు.
సినిమాకు టెక్నిషియన్స్, స్టాఫ్ అందరూ చాలా హార్ట్ వర్క్ చేసారని చెప్పారు.
ఈ సినిమాలో వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలు చక్కటి ధ్రిల్ అందిస్తాయని, అంతేగాక కావల్సినంత ఫ్యామిలీ హస్యం ఉందని చెప్పారు.
తదనంతరం దర్శకుడు సాయి శివన్ జంపన మాట్లాడుతూ వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న గ్రంధాలయం చిత్రం మార్చి 3 వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానందుని ఆయన తెలిపారు.
గ్రంథాలయం చిత్రం పూర్తిస్థాయి థ్రిల్లర్ సస్పెన్స్ తో కూడుకున్న చిత్రమని ప్రేక్షకులను కచ్చితంగా """/" /
ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.
ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తీసామని గ్రంథాలయంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
తదనంతరం హీరోయిన్ స్మిరిత రాణి మాట్లాడుతూ తెలుగులో తన మొట్టమొదటి చిత్రం గ్రంధాలయం అని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరించాలని ఆమె కోరారు.
దర్శకుడు సాయి ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారని తెలుగు ప్రజలందరికీ ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని ఆమె చెప్పారు.
సమావేశంలో నిర్మాత అయ్యప్ప పాల్గొన్నారు.
వైరల్ వీడియో: మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?