ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా జాతీయ అవార్డు అందుకున్న నటుడు

ఒక సినిమాకు అవార్డు రావాలన్న లేదా ఏదైనా ఒక ప్రశంస దక్కాలన్న ఖచ్చితంగా ఆ నటుడు గొప్ప గా నటించి ఉండాలి.

కానీ నటించడం కాదు జీవించాడు విక్రమ్.ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండానే జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.

ఆలా అందుకోవడం ఏమి మాములు విషయం కాదు.అందుకు ఎంతో కష్టం చేయాలి.

మొహంలోనూ, బాడీ లాంగ్వేజ్ లో నటన కు మించిన ఎక్సప్రెషన్ పలకగలగాలి.మరి విక్రమ్ అంత అద్భుతంగా నటించిన సినిమా పితాగామన్.

తెలుగు లో శివ పుత్రుడు పేరు తో విడుదల అయ్యింది.ఈ సినిమాలో పాత్ర విక్రమ్ కోసమే పుట్టింది అనేట్టుగా ఉంటుంది.

అంత అద్భుతంగా చేసాడు.మరి ఆ కష్టానికి దక్కిన ఫలితమే జాతీయ అవార్డు.

సినిమాను తీయాలని అనుకున్నప్పుడు దర్శకుడు బాల మనసులో ఇంకో నటుడు ఆలోచనకు కూడా రాలేదు.

కేవలం విక్రమ్ తోనే ఆ పాత్ర చేయించాలి అని ఫిక్స్ అయ్యారు.డైలాగ్స్ లేని పాత్ర అయినప్పటికి విక్రమ్ కథ పై, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నాడు.

చియాన్ అంటూ ముద్దుగా పిలుచుకోబడే విక్రమ్ కమల్ హాసన్ తర్వాత అంత బాగా అలవోకగా నటించగల నటుడు.

తమిళ ఇండస్ట్రీ తో పాటు యావత్ భారతదేశం మెచ్చుకునే అతి కొద్దీ మంది నటులలో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది.

"""/"/ ఇక తన వారసుడిని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.తండ్రిని మించిన నటుడిగా విక్రమ్ కొడుకు ప్రస్తుతం పేరు సంపాదించుకున్నాడు.

భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద స్టార్ అయ్యే అవకాశం విరివిగా ఉంది.ఇక విక్రమ్ కి మాత్రమే ఈ చిత్రం లో నటించినందుకు జాతీయ అవార్డు లభించింది.

ఈ సినిమా 2003 లో పితాగామన్ గా కోలీవుడ్ లో విడుదల అయ్యి సంచలనం సృష్టించాక, తెలుగు మరుసటి ఏడాది అంటే 2004 లో డబ్ చేయబడింది.

కన్నడ లో అనాథరు పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా బాగా ఆడింది.

పితాగామన్ లో నటన చుసిన తర్వాత శంకర్ విక్రమ్ చేత అపరిచుతుడు సినిమాకు నటింపచేసాడు.

ఇక ఆ తర్వాత విక్రమ్ రేంజ్ ఎంతలా మారిందో మనం కళ్లారా చూసాం.

చాల తక్కువ మంది మాత్రమే చేయగలిగే అతి తక్కువ భిన్నమైన పాత్రల్లో విక్రమ్ ఎంతో చక్కగా నటించి తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.

రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?