లియో సక్సెస్ మీట్.. పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్?
TeluguStop.com
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ( Vijay Thalapathy ) నటించిన తాజా చిత్రం లియో( Leo ) .
సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇలా ఈ సినిమా ఇప్పటివరకు అన్ని భాషలలో సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్( Success Meet )కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమిళనాడులోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. """/" /
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు అయితే ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా హీరో విజయ్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అలాగే ఈయన త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
2026 ఎన్నికలలో పోటీ చేయబోతున్నారా అన్న ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈయన షాకింగ్ సమాధానం చెప్పారు.
"""/" /
విజయ్( Vijay ) సమాధానం చెబుతూ కప్ మాత్రమే ముఖ్యం బిగిలు అంటూ ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా మారింది.
దీంతో తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దళపతి ఎంట్రీపై ఇలా హింట్ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే ఈయన పూర్తిస్థాయి రాజకీయాలలోకి వస్తారా రారా అన్న విషయాల గురించి మరి కాస్త స్పష్టత ఇవ్వాల్సి ఉందని తెలుస్తుంది.
అయితే ఈ మధ్యకాలంలో ఈయన పొలిటికల్ గా కాస్త యాక్టివ్ అయ్యారని తెలుస్తుంది.
ఇలా రాజకీయాల పరంగా ఈయన ఆసక్తి చూపడంతో రాజకీయాలలోకి కచ్చితంగా వస్తారని పలువురు భావించారు.
అయితే ఈ ప్రశ్నకు ఈయన చెప్పిన సమాధానం చూస్తే త్వరలోనే రాజకీయాల గురించి బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతుంది.
విశ్వనాథన్ భార్య చేసిన పనికి కార్ల్‌సన్ షాక్.. పొంగల్ వేడుకలో ఏం జరిగిందంటే?