రౌడీ హీరో తో సమంత ఫిక్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తాడని తెలిసిందే.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ విజయ్ దేవరకొండ సమంత కలిసి మహానటి సినిమాలో నటించారు.డైరక్టర్ శివ నిర్వాణ కూడా సమంతతో మజిలీ సినిమా చేశారు.

సో హిట్ కాంబో రిపీట్ అవబోతుంది.నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టిన సమంత సెలెక్టెడ్ సినిమాలనే చేస్తుంది.

అయితే విజయ్ దేవరకొండ సినిమా మాత్రం ఆమె స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఓకే చేసిందని అంటున్నారు.

లైగర్ తో ఎలాగు పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న విజయ్ దేవరకొండతో నటిస్తే తనకు ప్లస్ అవుతుందని భావిస్తుంది సమంత.

అందుకే స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ లేదని ఇదివరకు స్టేట్మెంట్ పాస్ చేసినా మళ్లీ విజయ్ తో చేసేందుకు రెడీ అవుతుంది.

సమంతతో విజయ్ రొమాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. స్వతహాగా సమంతకు సూపర్ ఫ్యాన్ అయిన విజయ్ ఆమెతో రెండోసారి జతకట్టబోతున్నాడు.

అయితే మహానటిలో కొద్ది పోర్షన్ మాత్రమే ఉండగా రాబోయే సినిమాలో ఫుల్ లెంగ్త్ లో వీరి జోడీ అలరించబోతుంది.

బిగ్‌బాస్ కంటే ఎర్రగడ్డ ఆసుపత్రే బెటరా.. హౌస్‌లో అన్నీ తిక్క కేసులే?