విజయ్ బీస్ట్ మోడ్ ఆన్.. ఆరు గంటలకు స్పెషల్ అప్డేట్..!
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా బీస్ట్.
ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
విజయ్ బీస్ట్ కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు వస్తుందని తెలుస్తుంది.
బీస్ట్ మోడ్ ఆన్ చేస్తూ స్పెషల్ అప్డేట్ గురించి ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు.
మరి సాయంత్రం బీస్ట్ టీజర్ వస్తుందా లేక ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
బీస్ట్ సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.బీస్ట్ తర్వాత విజయ్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నారని తెలిసిందే.
వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.దిల్ రాజు నిర్మించబోయే ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు.
మహేష్ వాయిస్ వల్ల ముఫాసాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు .. సూపర్ స్టార్ రేంజ్ ఇదే!