బిచ్చగాడు-2 గా వస్తున్న విజయ్ ఆంటోని పోస్టర్ విడుదల..

విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం " బిచ్చగాడు " చిత్రం మార్చి 4 2016 లో అయింది.

అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.తెలుగు పరిశ్రమలో సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది.

ఒక డబ్బింగ్ చిన్న  సినిమా అన్ని రికార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు.

  ఆ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోని తర్వాత ఎన్నో చిత్రాలను విడుదల చేసి  కమర్షియల్ గా ఓ  స్టార్ డమ్ ఏర్పరుచుకున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా పరిచయమైన విజయ్ ఆంటోని బిచ్చగాడు చిత్రం విజయం తర్వాత చాలా చిత్రాల్లో తన సొంత బ్యానర్ లో కూడా నటించారు.

బిచ్చగాడు చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇప్పుడు  ' బిచ్చగాడు-2 ' ని విజయ్ ఆంటోని తన స్వీయ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.విజయ్ ఆంటోని సొంత నిర్మాణ సంస్థ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

"""/"/ నేడు విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

విజయ్ ఆంటోని దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ' బిచ్చగాడు-2 ' చిత్రం పోస్టర్ ను విడుదల చేశారు ఈరోజు.

ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటున్న హీరోయిన్స్