ఆ గుడికి వెళ్లిన తర్వాత వెంకటేశ్ జీవితమే మారిపోయిందట.. ఏ గుడి అంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన్ విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

వెంకటేశ్ గత సినిమా సైంధవ్ ( Saindhav )ఫ్లాపైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ హీరో సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ అంచనాలకు మించి విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే చాలా విషయాలలో వెంకటేశ్ ఇతర హీరోలకు భిన్నంగా ఉంటారు.అరుణాచలం ఆలయం గురించి వెంకటేశ్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగానని ఈ క్రమంలో చాలామందిని కలిశానని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో లైఫ్ లో కూడా డిస్ట్రబ్ అయ్యానని ఆయన అన్నారు.చివరకు అరుణాచలం( Arunachalam ) వెళ్లి స్వామి దర్శనం తర్వాత స్కందాశ్రమంలో మెడిటేషన్( Meditation At Skandasram ) చేశానని వెంకటేశ్ పేర్కొన్నారు.

"""/" / అక్కడ ఏదో తెలియని శక్తి మనల్ని ప్రవేశిస్తుందని అసలైన హ్యూమన్ ఎనర్జీ అంటే ఏంటో అక్కడ తెలుస్తుందని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.

నేను అలాంటి శక్తిని అక్కడినుంచే పొందానని వెంకటేశ్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత నా లైఫ్ లో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్ట్రబ్ చేయలేదని ఈ హీరో అన్నారు.

ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే అని ఆయన తెలిపారు.

"""/" / ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుందని నేను అన్నది మరిచిపోయి ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకుంటామని వెంకటేశ్ తెలిపారు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది.జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలని భావించే వాళ్లు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు.

వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

1940ల నాటి చిరిగిన స్వెట్‌షర్ట్‌ అమ్మకానికి.. ధర వింటే కళ్లు తేలేస్తారు!