Varun Tej : వరుణ్ తేజ్ అసలు పేరు ఏంటో తెలుసా.. ఆధార్ కార్డులో అలా ఉందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ ( Operation Valentine )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ తేజ్ అన్ని భాషలలోనూ ఇంటర్వ్యూలో నిర్వహిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

"""/" / శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన అసలు పేరు గురించి బయటపెట్టారు తన పేరు ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ అయినప్పటికీ తన అసలు పేరు ఇది కాదని తన పేరు ముందు సాయి అనే పేరు కూడా ఉందని తెలిపారు.

"""/" / తన అసలు పేరు సాయి వరుణ్ తేజ్ ( Sai Varun Tej ) అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ పేరు పెద్దగా ఉండటంతో సాయి తీసేశానని ఇక ఆధార్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటిలో సాయి వరుణ్ తేజ్ అని ఉంటుంది అంటూ ఈ సందర్భంగా వరుణ్ తన అసలు పేరు బయట పెట్టడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

 .

వైరల్ వీడియో: సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..