వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రం ‘ గాండివధారి అర్జున ‘

విశాఖపట్నం: గాండివధారి అర్జున సినిమా బృందం విశాఖ నగరంలో సందడి చేసింది.ఈ సినిమా ఈనెల 25 తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ చేరుకున్నారు.

ఎస్వీ సిసి బ్యానర్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన గాండివదారి అర్జున మూవీ చిత్ర యూనిట్ మీడియా సమావేశం బీచ్ రోడ్ లో గల నోవాటేల్ హోటల్లో మంగళ వారం జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్ కోసం విశాఖ రావడం సంతోషంగా వుంది అన్నారు.

తాను విశాఖ లోనే స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందాను అని గుర్తు చేశారు.

కాబట్టి విశాఖ తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పారు.ఈ సినిమా వినోదం, యాక్షన్ తో కూడి ఉంటుంది అన్నారు.

కాగా, సినిమాలలో సందేశం ఇచ్చే సినిమాలు తక్కువగా వస్తాయి.గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే తరాల కోసం ఏదయినా చేయాలి అన్న సందేశం వుండే సినిమా ఇది అని వివరించారు.

ఈ సినిమా వినోదం తో కూడిన సందేశాత్మక సినిమా అవుతుంది అన్నారు.ప్రైవేట్ ఏజెన్సీ వ్యక్తి కి సంబంధించిన కథాంశంతో సినిమా వుంటుంది అన్నారు.

అలాగే, కాలుష్యం ఎలా పేరుకుపోతుంది అని ఎవరూ ఆలోచించరు అన్న కోణంలో చిత్ర కథ సాగుతుంది అన్నారు.

నటుడుకి ఒకే జోనర్ అన్నది వుండకూడదు అని ఒక ప్రశ్న కు సమాధానంగా చెప్పారు.

తదుపరి సినిమా ఏయిర్ ఫోర్స్ కదాంసం గా వుండే చిత్రం చేస్తున్నాను అని తెలిపారు.

కథ డిమాండ్ చేస్తేనే లావణ్యతో సినిమా వుంటుంది అని బదులిచ్చారు.హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ, తాను రెండో సారి విశాఖ వచ్చాను అని పేర్కొన్నారు.

నిర్మాత నమ్మకం నిలబెట్టుకునే రీతిలో తన పాత్ర వుంటుంది అన్నారు.వరుసగా రెండో సారి యాక్షన్ సినిమా చేయడం యాదృచ్ఛికం అన్నారు.

దర్శకుడు ప్రవీణ్ సత్తర్ మాట్లాడుతూ, వైజాగ్ చాలా బాగుంది, ట్రెయిలర్ కి మంచి స్పందన వచ్చింది అన్నారు.

సోషల్ కాజ్ ఆధారంగా ఏమోసన్, మెసేజ్ వుండే సినిమా అవుతుంది అన్నారు.సినిమా ఫస్ట్ కాపీ సంతృప్తి ఇచ్చింది.

క్లైమేట్ సమ్మిట్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించాం అని తెలిపారు.తొలిసారిగా మిక్కీ జే మేయర్ యాక్షన్ సినిమా కి సంగీతం అందించడం జరిగింది అని చెప్పారు.

ఈ సినిమా విశాఖలో కూడా చిత్రీకరణ చేసాము అన్నారు.విశాఖ ప్రేక్షకులకు సినిమా అంటే ఎంతో ప్రేమ వుంటుంది అన్నారు.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమా యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.

కాలుష్యం నేపథ్యంలో సాగే కథ తో సినిమా వుంటుంది అన్నారు.మీడియా సమావేశంలో ఇతర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

వర్షాకాలంలో ఈ న్యాచురల్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ తో ఇక నో టెన్షన్!