సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ తో వైష్ణవ్ తేజ్..!

ఉప్పెనతో మెగా హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.

ఉప్పెన భారీ హిట్ కొట్టడంతో మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.

ఈ క్రమంలో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో జంగిల్ బుక్ సినిమా రిలీజ్ కు రెడీ అవగా తమిళ అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్య డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా షైన్ స్క్రీన్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడట వైష్ణవ్ తేజ్.

దీనికి సంబందించిన కథా చర్చలు ముగిశాయని టాక్.మజిలీ సినిమాతో నిర్మాతలుగా మారారు హరీష్ పెద్ది, సాహు గారపాటి.

నానితో టక్ జగదీష్ కూడా తీశారు.శ్రీవిష్ణు నటించిన గాలి సంపత్ సినిమాను వీరే రిలీజ్ చేశారు.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న షైన్ స్క్రీన్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ సినిమా వస్తుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు సినిమా ఎలాటి కథతో వస్తుంది అన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది.

సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. """/"/ మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాల లైనప్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.

చేసింది ఒక్క సినిమానే అయినా నటనలో మెగా పవర్ చూపించిన వైష్ణవ్ తేజ్ మిగతా మెగా హీరోల్లానే మెగా మేనియా కొనసాగించేలా ఉన్నాడు.

నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు… ట్రోల్స్ పై స్పందించిన అనిల్ రావిపూడి!