ఇష్క్ ప్రమోషన్ కు హీరో ఎన్ని కష్టాలో.. వైరల్ వీడియో!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో బాల నటుల నుండి హీరోలుగా పరిచయమైన నటులు ఎంతో మంది ఉన్నారు.
ప్రస్తుతం ఆ హీరోలే యంగ్ హీరోలు టాలీవుడ్ లో తెగ జోరందుకుంటున్నారు.బాల నటుల నుండి స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును కూడా అందుకున్నారు.
ఇక తాజాగా మరో బాలనటుడు ప్రస్తుతం హీరోగా పరిచయము కాగా.తాజాగా ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో బాలనటుడిగా నటించిన తేజ సజ్జా.
తేజ చైల్డ్ ఆర్టిస్ట్ లు మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ.
2019లో సమంత నటించిన ఓ బేబీ సినిమా ద్వారా లీడ్ పాత్రలో నటించాడు.
ఆ తర్వాత హీరోగా 2021 లో విడుదలైన జాంబి రెడ్డి సినిమా తో పరిచయం అవగా.
ఈ సినిమా అంతగా సక్సెస్ ని ఇవ్వకపోగా.తేజ కు మాత్రం తన నటనతో మంచి సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు.
"""/"/
ఇక తేజ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజు దర్శకత్వంలో 'ఇష్క్' ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అనే ట్యాగ్ తో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించాడు.
ఇందులో హీరోయిన్ గా కన్ను గీటు భామ ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది.
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.ఇందులో లవ్ స్టోరీ లా అనిపివ్వకపోగా.
ఈ ట్రైలర్ మాత్రం బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 23 న విడుదల చేయనున్నట్లు తెలియగా.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ సెలబ్రిటీ ని ఈవెంట్ కు ఆహ్వానించడానికి పలు పాట్లు పడ్డాడు.
దానిని వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయగా.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?