సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు'.. డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ఆగష్టు 27న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

చిలసౌ, అల వైకుంఠపురములో తర్వాత సుశాంత్ నటించిన ఈ సినిమా కూడా అతనికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాగా సినిమా డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.సెప్టెంబర్ 17న ఆహాలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశారు.

దర్శన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

థియేటర్ కి వెళ్లి చూడలేని ప్రేక్షకులు సుశాంత్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ లో చూసే అవకాశం ఉంది.

ఆహా ఈ సినిమాను మంచి ప్రైజ్ ఇచ్చి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.సినిమాలో ఒకప్పటి హీరో వెంకట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.

వెన్నెల కిశోర్, ప్రియదర్శి లు కూడా సినిమాలో నటించారు. సినిమాలో అభినవ్ గోమటం కూడా ప్రత్యేక పాత్రలో మెప్పించాడు.

సునీల్ కూడా సర్ ప్రైజ్ రోల్ లో నటించి మెప్పించాడు. సినిమా థియేట్రికల్ రన్ లో పర్వాలేదు అనిపించుకోగా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఆఫర్లు లేక సిరి హన్మంత్ అలా చేసింది.. వైరల్ అవుతున్న నూకరాజు షాకింగ్ కామెంట్స్!