సూర్య, జ్యోతిక రెండు సార్లు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది…వీరిది మామూలు లవ్ స్టోరీ కాదు

తమిళ్ హీరో శివకుమార్ అంటే తమిళ్ ఇండస్ట్రీ లో తెలియని వారు ఉండరు.

మనకు పెద్దగా తెలీదు కానీ అక్కడ ఆయనకి సెపరేట్ ఫాన్స్ ఉన్నారంటే నమ్ముతారా.

ఇక్కడ మనకి శోభన్ బాబు ఎలాగో అక్కడ శివకుమార్ అలాగా.ఎలాగైతే ఇక్కడ శోభన్ బాబు సినిమా రిలీజ్ ఉందంటే లేడీ ఫ్యాన్స్ సినిమా థియేటర్ కి క్యూ కట్టేవారో అలాగే శివకుమార్ సినిమాకు కూడా అలాంటి ఫాన్స్ ఉండేవారు.

ఇంతకీ ఆ శివ కుమార్ ఎవరంటే హీరో సూర్య వాళ్ళ నాన్న.సూర్య ని ఇండస్ట్రీ కి రమ్మంటే తనకి ఇంట్రస్ట్ లేదని చెప్పిన సూర్య తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇండస్ట్రీ కి వచ్చారు.

సూర్య కి సిగ్గు, బిడియం బాగా ఉంటుంది. """/"/ అలాంటి సూర్య జ్యోతిక తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేయాల్సి వచ్చింది.

దాంతో సూర్య, జ్యోతిక తో మాట్లాడానికి చాలా ఇబ్బంది పడేవారు.అలాంటి టైం లో ఏం చేయాలో తెలియక సూర్య కొన్నిసార్లు బాగా ఇబ్బంది పడేవారు.

తర్వాత, తర్వాత జ్యోతిక సూర్య కి ఫ్రెండ్ అయింది.ఆలా వల్ల మధ్య ప్రేమ చిగురించింది.

ఇక సూర్య గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది ఎందుకంటే సూర్య తమిళ్ హీరో అని తెలుగు లో ఉన్న చాల మంది జనాలకి తెలీదు సూర్య ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేసాడు, దాంట్లో గజినీ మొదటిది.

7th సెన్స్ సినిమాల్లో బౌద్ధ ధర్మ క్యారెక్టర్ ని పోషించి చాల మంచి పేరు తెచ్చుకున్నాడు.

అలాంటి హీరో ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు.సూర్య హీరో గానే కాకుండా అతనికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉంటుంది.

సమాజం లో అనాధ పిల్లలకు సేవ చేస్తూ ట్రస్ట్ లు నడిపిస్తూ ఉంటాడు.

"""/"/ ఇక సూర్య గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఖాఖా ఖాఖా లో సూర్య, జ్యోతిక హీరో హీరోయిన్ లు గా చేసారు.

అదే సినిమా ని తెలుగు వెంకటేష్ తో ఘర్షణ గా రీమేక్ చేసారు.

ఇక జ్యోతిక గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎందుకంటే జ్యోతిక తెలుగులో కూడా చాల సినిమాలు చేసింది.

చిరు తో ఠాగూర్, నాగ్ తో మాస్ సినిమా చేసింది.అలాగే జ్యోతిక చంద్రముఖి లో రజినీకాంత్ తో కూడా యాక్టింగ్ చేసింది.

అయితే జ్యోతిక తాను ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో చెప్పడానికి సూర్య కొంచం కంగారు పడ్డ, ఆ తర్వాత ఇంట్లో చెప్పడం తో శివకుమార్ ఒప్పుకోలేదు.

ఏం చేయాలో సూర్య కి తోచకపోవడంతో నాన్న ని ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

ఫ్రెండ్స్ సహాయం తో తనని నమ్మిన జ్యోతిక నమ్మకాన్ని నిజం చేస్తూ జ్యోతిక ని పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత సూర్య నాన్న కి విషయం తెలిసి, కొడుకు వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాడు అంటే పరువు పోతుందని సూర్య ని ఇంటికి రమ్మని సూర్య కి జ్యోతిక కి మల్లి పెళ్లి చేసాడు.

ఆలా రెండు సార్లు సూర్య మరియు జ్యోతిక పెళ్లి చేసుకొవాల్సి వచ్చింది. """/"/ సూర్య జ్యోతికలకు దియా అనే కూతురు, దేవ్ అనే కొడుకు ఉన్నాడు.

పెళ్లి తర్వాత మొత్తం సినిమాలనే మానేసిన జ్యోతిక రీసెంట్ గా కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.

తెలుగు ఇండస్ట్రీ లోను తమిళ్ ఇండస్ట్రీ లోనే బెస్ట్ కపుల్స్ ఎవరంటే సూర్య జ్యోతిక ల పేర్లే చెపుతుంటారు.

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే, హరి డైరెక్షన్ లో చేసిన సింగం సిరీస్ లో అంతకు ముందు చూడని స్టైల్ తో ఉర మాస్ సినిమాలు చేసారు.

అసలు ఒకపుడు సినిమా అంటేనే ఇంట్రస్ట్ లేని సూర్య ఇప్పుడు టోటల్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో అంటే అసలు ఇది నిజం గా ప్రతి ఒక్కరు గర్వించదగిన విషయం.

సూర్య లాంటి లవర్ ఉండాలి అని ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది.ప్రతి ఒక్క భార్య తన భర్త సూర్య లాగా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండాలని కోరుకుంటుంది.

సూర్య అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి దాకా అందరు సూర్య ఫాన్స్ గా ఉండడానికి ఇష్టపడుతారు.

ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం సూర్యది.సూర్య డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలనీ చాలా రోజులనుండి చూస్తున్న సరైన స్టోరీ దొరకడం లేదు.

ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఒక మంచి తెలుగు సినిమా చేయాలనీ కోరుకుందాం.

సూర్య తెలుగు లో ఇంత పాపులర్ అయినా తనకి తెలుగు మాట్లాడం రాదు.

కానీ తన తమ్ముడు కార్తీ చాలా బాగా తెలుగు మాట్లాడతాడు.సూర్య ని ఎప్పుడు అడిగిన తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని చూస్తున్న అంటారు.

చూద్దాం మరి అయన ఎప్పుడు తెలుగు నేర్చుకుంటారో.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు తత్వం బోధపడిందా.. ఇకనైనా ఆ ఒక్క విషయంలో మారతారా?