కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది… సూర్య కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Suriya ) త్వరలోనే కంగువ (Kanguva) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా నవంబర్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో సందడి చేశారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి సూర్యతో పాటు డైరెక్టర్ శివ నిర్మాత జ్ఞానవేల్ రాజా హాజరై సందడి చేశారు.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ( Nagarjuna ) హీరో సూర్యతో ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.

అలాగే కంగువ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అయితే సూర్య నాగార్జునతో తెలుగులో మాట్లాడటం విశేషం.

  సూర్య తెలుగులో మాట్లాడటంతో నాగార్జున తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు సూర్య అనడంతో లేదు సర్ నేను స్పష్టంగా మాట్లాడటం లేదు కానీ తమ్ముడు కార్తీ ( Karthi ) మాత్రం తెలుగు చాలా బాగా స్పష్టంగా మాట్లాడుతారు.

ఈ విషయంలో తనని చూస్తే నాకు చాలా అసూయగా ఉంటుందని తెలిపారు. """/" / ఇక క్లాస్ లో కూడా కార్తీ ఫస్ట్ స్టూడెంట్ నేను మాత్రం లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నా మార్క్స్ అన్నీ కూడా బార్డర్ లోనే ఉంటాయంటూ పలు విషయాలు తెలిపారు.

ఇక నాగార్జున మాట్లాడుతూ గతంలో కార్తీక్ బిగ్ బాస్ వేదిక పైకి వచ్చినప్పుడు తన సినిమాలో పాట పాడినట్లు గుర్తు చేశారు.

ఆ మాటకు సూర్య మాట్లాడుతూ మీ సాంగ్స్ అలాగే చిరు సర్ సినిమాలోని పాటలన్నీ పాడుతుంటారు తనకు తెలుగు చాలా స్పష్టంగా వచ్చు అంటూ సూర్య తెలిపారు.

వీడియో: పర్వతాలలో తప్పిపోయిన వ్యక్తి.. దారి చూపించిన వీధి కుక్క?