ఆ విషయంలో చిరంజీవి గారు నాకు స్ఫూర్తి… హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Suriya ) త్వరలోనే కంగువ( Kanguva ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

డైరెక్టర్ శివ ( Shiva ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనే పద్యంలో సూర్య తెలుగులో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తెలంగాణలో అలాగే వైజాగ్ లో కూడా సినిమా వేడుకలలో పాల్గొన్నారు.

ఇటీవల వైజాగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సూర్య తెలుగు హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

"""/" / ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.నాకు నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

కానీ చిరంజీవి ( Chiranjeevi ) గారు మాత్రం స్వయంగా ఫోన్ చేస్తే తనకు శుభాకాంక్షలు చెప్పారు.

అంతేకాకుండా ఒకసారి తనని కలవమని తన ఇంటికి ఆహ్వానించారు.చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా ఫిష్ కర్రీ దోశ చేసి పెట్టారని సూర్య తెలిపారు.

ఇక నేను చెన్నైలో ఇల్లు కట్టుకోవడం ఎన్జీవో సంస్థలను ఏర్పాటు చేయడం వంటివి అన్నీ కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని చేశానని తెలిపారు.

"""/" / చిరంజీవి గారి స్ఫూర్తితోనే నేను ఎన్జీవో సమస్థ ద్వారా సుమారు 6000 మంది విద్యార్థులు చదువుకు సహాయం చేయగలిగానని సూర్య తెలిపారు.

ఇక టాలీవుడ్ హీరోల గురించి కూడా ఈయన మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అంటూ తెలిపారు.

చరణ్ 15 సినిమాలకే గ్లోబల్ స్టార్ ఇమేజెస్ సొంతం చేసుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ రియల్ జీవితంలోను రియల్,రీల్ జీవితంలో కూడా ఒకేలా ఉంటారని తెలిపారు.

మహేష్ స్క్రీన్ పై యాటిట్యూడ్ నాకు నచ్చుతుందని తెలిపారు.ఇక అల్లు అర్జున్ డాన్స్ కు నేను అభిమానిని పుష్ప 2సినిమా కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.

ఇక చివరిగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనలాగా తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడేవారు లేరని తెలిపారు.

యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?