నాగార్జునకు డబ్బింగ్ చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరంటే?

ప్రతి హీరో వారివారి సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పరు.ఎందుకంటే వారి పాత్రకు వారి గొంతు సరితూగని పరిస్థితులలో వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ లు డబ్బింగ్ చెబుతుంటారు.

వారి తమ సొంత భాషల్లో హీరోకు డబ్బింగ్ అవసరం ఉండదు అనేది మనకు తెలిసిన విషయమే అయితే మిగతా భాషల్లో డబ్ అయ్యేటప్పుడు మాత్రం అక్కడి భాష స్పష్టంగా మాట్లాడుతున్నట్టు అనిపించాలి.

అలా అనిపించాలంటే అక్కడి భాషపై పూర్తి పట్టు ఉండాలి.లేకపోతే అసలుకే మోసం వస్తుంది.

ఈ విషయం ముందుగానే గ్రహించే దర్శక నిర్మాతలు ఇతర భాషల్లో డబ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ప్రేక్షకులను సినిమాలో మాత్రమే ఇన్వాల్వ్ చేయాలని ఉంటుంది.మిగతా విషయాలు ఏవీ ప్రేక్షకుల దృష్టి మరల్చేలా ఉండకూడదనేది దర్శక నిర్మాతల ఆలోచన అయితే నాగార్జునకు ముఖ్యంగా కోలీవుడ్ లో డబ్ అయితే సీనియర్ హీరో సురేష్ నాగార్జునకు డబ్బింగ్ చెబుతారట.

ఈ విషయం స్వయంగా హీరో సురేష్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.ఎందుకంటే నాగార్జున వాయిస్ కు హీరో సురేష్ వాయిస్ కు దగ్గరి పోలికలు ఉంటాయనేది దర్శక నిర్మాతల ప్రగాఢ నమ్మకం.

ఏది ఏమైనా పరస్పర సహకారంతోనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుందని, ప్రేక్షకులను అలరించడమే కళాకారులుగా తమ ప్రధాన కర్తవ్యమని హీరో సురేష్ చెప్పుకొచ్చారు.

దేవుడా.. మహిళలు ఎంతకు తెగించారు.. వ్యక్తిని ఏకంగా..?