మేమ్ ఫేమస్ మూవీ రివ్యూ…
TeluguStop.com
సుమంత్ ప్రభాస్( Sumanth Prabhas ) హీరోగా నటిస్తూ.స్వయంగా తానే తెరకెక్కించిన చిత్రం మేమ్ ఫేమస్.
( Mem Famous Movie ) లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిపి చేస్తున్న ఈ సినిమాలో .
మణి ఏగుర్ల ,మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్ , పోస్టర్స్ , సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
దీనికి తోడు చిత్ర యూనిట్ చేసిన ప్రత్యేకమైన ప్రమోషన్స్ కూడా సినిమా పై అంచనాలని పెంచాయి .
మరి యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫెమస్ అయిన .సుమంత్ ప్రభాస్ కూడా ఫెమస్ అయ్యే సత్తా సినిమాలో ఉందా అనేది రివ్యూ( Mem Famous Review ) ద్వారా తెలుసుకుందాం """/" /
ముందుగా కధ విషయానికి వస్తే .
ఇది ముగ్గురు స్నేహితుల కధ .ముగ్గురు ఊళ్లో గాలిగా తిరుగుతూ ఉంటారు .
అయితే ఊర్లో అనుకోని రీతిలో వీరు విమర్శలకు గురవుతారు .అందరి చేత మాటలు పడుతూ ఉంటారు .
దీనితో వాళ్ళు తామెలా కావాలో ఆలోచించుకుంటూ ఉంటారు .చివరగా ఒక నిర్ణయం తీసుకుంటారు .
మరి దానితో వాళ్ళు ఫెమస్ అయ్యారా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారా .వారు చివరికి ఏమి సాధించారు అనేది సినిమా కధ .
"""/" /
ఇక విశ్లేషణ విషయానికి వస్తే .సినిమాని ఆసక్తికరంగా .
సరదాగా తెరకెక్కించిన విధానం బాగుంది .నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన విధానం బాగుంది .
ముగ్గురు స్నేహితులు వాళ్లు కలిసి పెరిగే స్నేహం గురించి ఇందులో చక్కగా చూపించారు.
అలాగే తల్లి .పిల్లలు అనుబంధాల్ని చక్కగా చూపించారు .
హీరో ప్రేమని .బాగా సెటిలై ఆమెను పెళ్లి చేసుకునే విధానాన్ని ఆకట్టుకునే రీతిలో చూపించారు .
ముగ్గురు స్నేహితులు.తామెలా ఫేసమ్ కావాలో నిర్ణయించుకొని .
అందుకోసం చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి. """/" /
ఈ మధ్య కాలంలో థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించాలంటే ఫన్ మెయిన్ గా ఉండాలి .
తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పని పాటలేని ముగ్గురు కుర్రాళ్లు.
వాళ్లను ఇంట్లో వాళ్లే కాదు ఊర్లోని తిట్టని వారుండరు.అలా సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న వీళ్లు లవర్స్‌ను సెట్ చేసుకునే పనిలో పడటం .
వాతై వలన ఇబ్బందుకు నవ్వించే రీతిలో చూపించారు .సరదాగా గడిచిపోతున్న ఈ కుర్రాళ్ల జీవితంలోకి సమస్యలు రావడం .
తమను తాము ఎలాగైనా నిరూపించుకోవాలని కుర్రాళ్లు ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టడం .
అవన్నీ సరదాగా సాగుతూనే ఆసక్తిని పెంచుతాయి . """/" /
ఇక నటీనటుల విషయానికి వస్తే .
సుమంత్ ప్రభాస్ తాను దేనికి సెట్ అవుతానో అలనాటి కధని రాసుకొని .
తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు .అలాగే మణి ఏగుర్ల , మౌర్య చౌదరి తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు , సార్య, సిరి రాసి కూడా ఒకే అనిపిస్తారు .
మిగతా వారు తమ పరిధి మేరకు మేప్ప్పించే ప్రయత్నం చేశారు
ఇక దర్శకుడు సాంకేతిక విషయాలకు వస్తే .
సుమంత్ ప్రభాస్ ఏ సినిమాను ముందుగానే ఫోన్ లో తీసి మరి నిర్మాతలని ఒప్పించారు .
వెండితెరపై కూడా దాదాపు అలాంటి మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేశారు .
శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది .సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ ఒకే .
అరవింద్ మూలి ఆర్ట్ వర్క్ బాగుంది .కళ్యాణ్ నాయక్ సంగీతం అలరిస్తుంది.
మొత్తంగా చుస్తే .సరదాగా సాగుతూనే బాధ్యతలని గుర్తు చేసే ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది .
ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ