అటు టీడీపీ ఇటు జనసేన మధ్యలో ఆ హీరో

ఒకవైపు చూస్తే అధికార పార్టీ మరో వైపు చూస్తే తన సహా నటుడు పెట్టిన పార్టీ.

ఏ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది .? ఎప్పటి నుంచో రాజకీయాల్లో చేరి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరిక ఏ పార్టీలో చేరితే తీరుతుయింది అనే సందిగ్ధంలో పడిపోయాడు ఆ హీరో.

ఒకప్పుడు హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఇప్పుడు ఖాళీ అయిపోయిన హీరో సుమన్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాడు.

కొంతకాలంగా రాజకీయాల్లో చేరాలని ఏపీలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుమన్ తనకు అనువైన పార్టీ కోసం ఇంతకాలం వేచి చూసాడు.

ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుండడంతో ఆయనలో కూడా కంగారు మొదలయ్యింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇటీవల విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో.తన రాజకీయ గురువు టీడీపీ అధినేత చంద్రబాబేనని సుమన్ వెల్లడించాడు.

బాబు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, క్రమశిక్షణకు బాబు మారు పేరని పొగడ్తలతో ముంచేశాడు.

అయితే ఆయన టీడీపీలోకి వచ్చేందుకు మాత్రం సముఖంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.అయితే తనంతట తానుగా కాకుండా బాబు ఆహ్వానిస్తే.

వెళ్లాలనేది సుమన్ ప్లాన్‌.ఇక, బాబు సైడ్ నుంచి చూసినా.

ఆయనకు కూడా టాలీవుడ్ నుంచి సహకారం తప్పనిస రిగా కావాల్సిందే.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేసుకున్నాడు బాబు.

గత ఎన్నికల్లో టీడీపీ అధికారం చెప్పట్టడానికి పవన్ అందించిన సహకారం ఎవరూ మర్చిపోలేరు.

కేవలం పవన్ ఛరిష్మాతోనే ఎన్నికల్లో గట్టెక్కిన విష్యం బాబు కి బాగా తెలుసు.

కానీ వచ్చే ఎన్నికల్లో పవన్ ఒంటరి పోరుకు రెడీ అవుతున్నాడు.దీంతో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అయిన పోసాని, మోహన్‌బాబు, కృష్ణుడు, రాజా, పృథ్వి లాంటి వాళ్లు జగన్‌కు ఓపెన్‌గానే మద్దతు ఇస్తున్నారు.

ఈ క్రమంలో సుమన్ లాంటి వాళ్ల అవసరం టీడీపీకి కూడా ఉంది.ఒక వేళ చంద్రబాబు పిలవకపోయినా పవన్ పార్టీలోకి చేరేందుకు రెడీ అనే వ్యాఖ్యలు చేశాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సుమన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయని.ముఖ్యంగా యువతలో పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్నారు.

పవన్ ను చాలా మంది యువత ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు వాస్తవానికి గత ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సుమన్ పేరు గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ రేసులో ప్రముఖంగా వినిపించింది.

సుమన్ తరచూ రేపల్లెలో పర్యటించేవారు.ఒకానొకదశలో రేపల్లె టీడీపీ సీటు సుమన్‌కే అన్న ప్రచారం బలంగా వినిపించింది.

ఆ నియోజకవర్గంలో సుమన్ సామాజికవర్గమైన గౌడ సామాజికవర్గం ఓటర్లు 42 వేల మంది ఉన్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నేపథ్యంలో సుమన్ అక్కడ టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

అందుకే ఆ నిజయోజకవర్గం టీడీపీ, జనసేన ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ లో చేరేందుకు సుమన్ ఆసక్తికనబరుస్తున్నాడు.

అన్నల కంటే కూడా తమ్ముళ్లె బెటర్ అని అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోలు !