సుధీర్ బాబు చితగ్గొట్టాడు.. కరుణ కుమార్ నిరాశపరచాడు..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు తన సొంత ప్రయత్నాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.

సినిమా సినిమాకు తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ గా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో వచ్చాడు.

సినిమాలో లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు అదిరిపోయేలా నటించాడు.సూరి బాబు కటౌటు సినిమాలో అదిరిపోయింది.

నటన పరంగా సుధీర్ బాబు కెరియర్ లో ఇదే హైలెట్ అని చెప్పొచ్చు.

ఇక తన సిక్స్ ప్యాక్ లుక్.పర్ఫార్మెన్స్.

ఎమోషనల్ సీన్స్ అన్ని సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.అయితే హీరోగా సుధీర్ బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా డైరక్టర్ కరుణ కుమార్ మాత్రం ఆశించిన స్థాయిలో సినిమాను తెరకెక్కించలేదని చెప్పొచ్చు.

శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్ తప్ప సినిమా అంతా రొటీన్ గా నడిపించాడు.

చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.తాను చెప్పాలనుకున్న పాయింట్ చివర్లో పెట్టి మిగతా సినిమా అంతా ఎంటర్టైన్ చేయాలని చూశాడు.

అయితే ఆ విషయంలో మాత్రం డైరక్టర్ సక్సెస్ అవలేదు.హీరోగా సుధీర్ బాబు హీరోయిన్ గా ఆనంది ఇద్దరు తమ అభినయంతో మెప్పించారు.

ఏపీలో వచ్చేది కూటమి సర్కారే..: కిరణ్ కుమార్ రెడ్డి