ఆ ఒక్క కారణంతోనే శ్రీకాంత్ పబ్ కల్చర్ కి దూరంగా ఉంటున్నారా?

ప్రస్తుతం బెంగుళూరు రేవ్ పార్టీకి(Rave Party) సంబంధించినటువంటి విషయాలు సంచలనంగా మారాయి.ఈ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అరెస్టు అయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్(Drugs ) వాడారని తెలిసి పోలీసులు రైడ్ చేశారు.

ఇలా ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ పార్టీలో భాగంగా టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి హేమ, శ్రీకాంత్(Sreekanth ) ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. """/" / ప్రస్తుతం నేను నా ఇంట్లోనే ఉన్నాను అంటూ ఈయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు.

పైగా తనుకు పబ్ కల్చర్ అంటే ఏమాత్రం నచ్చదని అందుకే తాను ఎప్పుడూ కూడా ఇలాంటి వాటికి వెళ్ళనని తెలిపారు.

అయితే శ్రీకాంత్ ఇలా పబ్ లకు పార్టీలకు ఎందుకు వెళ్లరు అనే విషయం గురించి ఈయన గతంలో ఓసారి వెల్లడించారు.

అయితే తాజాగా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సంచలనంగా మారడంతో మరోసారి శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / తనకు మొదటి నుంచి కూడా ఇలాంటి కల్చర్ అంటే ఇష్టం లేదని ఈయన తెలిపారు.

ఎందుకంటే ఇలాంటి పార్టీలలో ఎక్కువగా హీరోయిన్స్ అటెండ్ అవుతూ ఉంటారు.వారితో ఫ్లూయెంట్ గా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు .

ఎక్కడైనా తప్పు మాట్లాడితే పరువు పోతుందని హాయ్ బాయ్ చెప్పి మాత్రమే వెళ్తాను అలాగే ఇలాంటి పార్టీలు కల్చర్ వల్ల నా ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశంతోనే ఇలాంటి పార్టీలన్నిటికీ కూడా దూరంగా ఉంటానని శ్రీకాంత్ తెలిపారు.

తన ఫ్యామిలీతో కలిసి తాను వెకేషన్ వెళ్లడం ఎంజాయ్ చేస్తాను కానీ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా పార్టీలు పబ్ అంటే తనకు ఇష్టం ఉండదని వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఫ్యామిలీతో సమయం గడపడానికి ఇష్టపడతానని తెలిపారు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆ తప్పు చేయొద్దంటూ దీపికకు నెటిజన్ల సలహాలు.. ఏమైందంటే?