విశాఖ స్టీల్ ప్లాంట్ పోరుకు సినీ నటుడు శివాజీ సంఘీభావం.. !
TeluguStop.com
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు లభిస్తుంది.విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదంతో ముందుకెళ్లుతున్న ఏపీ ప్రజలకు తెలంగాణ నుండి కూడా మద్దతు లభిస్తుంది.
ఇలా రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరుకు సినీ నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు.
ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మవద్దని, సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సూచించారు.
ఈ విషయం పై నేతలను ఢిల్లీకి పరుగులు తీయించాలని అన్నారు.ఇక స్వచ్చమైన అవినీతి రహిత పాలన లేని దేశంలో బీజేపీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోందని శివాజీ విమర్శించారు.
ఈ అంశం పై పోరాడి సాధించాలే గాని వెనకడుకు వేసి ఓటమి పొందవద్దని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ అరెస్టుపై మాట మార్చిన టాలీవుడ్ కమెడియన్… భయపడుతున్నారా?