విజయ్ వరిసు కోసం రంగంలోకి దిగిన హీరో శింబు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమాని టాలీ వుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాని తమిళంలో నిర్మించి తెలుగులో డబ్ చేయనున్నారు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇకపోతే సినిమా కోసం మరొక కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన గాత్రాన్ని అందించబోతున్నారని తెలుస్తోంది.

శింబు హీరోగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే.

ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించడంతో ఈ పాటలు ఎంతో మంచిది సక్సెస్ సాధించాయి.

ఈ క్రమంలోనే మరోసారి విజయ్ సినిమా కోసం ఒక పాటను పాడబోతున్నట్లు తెలుస్తుంది.

వరిసు సినిమాలో శింబు ఒక పెప్పీ సాంగ్‌ను పాడబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ట్యూన్ కూడా తమన్ సిద్ధం చేసి పెట్టారని సమాచారం.

"""/"/ ఇకపోతే శింబు చేత ఈ పాటను కేవలం తమిళ వర్షన్ కి మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే తెలుగులో కూడా అతని చేతే పాడిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

గత కొద్ది రోజుల క్రితం లింగు స్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన దివారియర్ సినిమాలో బుల్లెట్ బండి సాంగ్ పాడి సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ పాట తెలుగు తమిళ భాషలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే మరోసారి వారసుడు సినిమా కోసం శింబు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

గేమ్‌ ఛేంజర్‌ ‘దోప్‌’ సాంగ్‌ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్