చిన్నా ఇలాంటివి తెలుగులో వర్కౌట్‌ అవ్వవని తెలియదా?

సిద్దార్థ్‌( Sidharth ) హీరోగా తమిళ్‌ లో రూపొందిన చిత్తా సినిమా పై( Chittha Movie ) అక్కడ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సిద్దు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం జరిగింది.

తెలుగు లో చిన్నా గా ఈ సినిమా ను రిలీజ్ చేశారు.తన సినిమా కు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ సిద్ధు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.

సిద్ధు సినిమా ను ఎవరు చూస్తారు లే అని నిర్మాతలు, బయ్యర్లు అన్నారట.

నిజంగానే అదే పరిస్థితి ఏర్పడింది.ఎవరు పెద్దగా తెలియని ముగ్గురు హీరో లు నటించిన మ్యాడ్‌ సినిమా కు ( Mad Movie ) ప్రేక్షకులు బ్రహ్మర్థం పడుతున్నారు.

కానీ సుపరిచితుడు అయిన సిద్దు నటించిన చిన్నా సినిమా ను మాత్రం తెలుగు ప్రేక్షకులు లైట్‌ తీసుకున్నారు.

"""/" / ఇదెక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకోవాల్సిన పని లేదు.ఎందుకంటే సిద్దు సినిమా బాగా లేదు కనుక జనాలు లైట్ తీసుకుంటున్నారు.

చిన్నా సినిమా కు( Chinna Movie ) పాజిటివ్ టాక్‌ వచ్చి ఉంటే కచ్చితంగా ఆ సినిమా వైపు పరుగులు తీసేవారు.

చిన్నా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన సినిమా అంటూ ప్రమోషన్ సమయంలో సిద్దు తెగ ప్రచారం చేశాడు.

కానీ అది నిజం కాదని తేలిపోయింది.ఒక సింపుల్‌ సెంటిమెంట్‌ మూవీ అంటూ విడుదల అయిన తర్వాత తెలిసి పోయింది.

ఇలాంటి కాన్సెప్ట్‌ లతో తెలుగు లో గతంలో సినిమా లు వచ్చాయి. """/" / వాటిల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిస్తే కొన్ని అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.

అద్భుతం జరిగితే తప్ప హిట్ అయిన దాఖలాలు లేవు.అలాంటిది మళ్లీ అదే కాన్సెప్ట్‌ తో కాస్త కొత్తగా చూపిస్తున్నాం అంటూ ప్రచారం చేసినంత మాత్రాన జనాలు చూస్తారు అనుకుంటే పొరపాటే అన్నట్లుగా కొందరు విమర్శలు చేస్తున్నారు.

చిన్నా కి బ్యాడ్‌ రివ్యూలు వచ్చాయి.తమిళ్ లో పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి కానీ ఇతర ఏ భాషలో అయినా కూడా మినిమం వసూళ్లు నమోదు అవుతున్నాయి అన్న దాఖలాలు లేవు.

కనుక సిద్దు రాంగ్ స్టెప్ వేసినట్లు అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.