Siddharth: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరో సిద్దార్థ్ వార్నింగ్.. సంబంధంలేని మాటలంటూ?
TeluguStop.com
హీరో హీరోయిన్ ల వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడెప్పుడు అడగాలా అని చూస్తూ ఉంటారు కొందరు రిపోర్టర్లు( Reporters ).
అందుకే ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే చాలు వాళ్లలో ఉన్న డౌట్ లన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలో కొందరు నటీనటులు తమ వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడుతుంటే మరికొంతమంది అందరి ముందే ఫైర్ అవుతూ ఉంటారు.
తిరిగి మరో ప్రశ్న వేయకుండా చేసేలా చేస్తుంటారు.అయితే తాజాగా హీరో సిద్ధార్థ్( Hero Siddharth ) కూడా అలాగే చేశాడు.
ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాలలో చేసి స్టార్ హీరో స్థాయి వరకు వచ్చే సమయంలో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
ఇక సిద్ధార్థ్ సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించాడు.
"""/" /
ఈయన 2003లో బాయ్స్ సినిమాతో( Boys Movie ) తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఈ సినిమా తనకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత బొమ్మరిల్లు, ఆట వంటి పలు సినిమాలలో కూడా నటించాడు.
ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మాత్రం అతడికి మంచి సక్సెస్ ని అందించింది.
ఇక ఈయన తెర ముందు ఎంత సైలెంట్ గా ఉంటాడో తెరవెనుక మాత్రం బాగా వైలెంట్.
ముక్కుసూటిగా తన నోటికి వచ్చే విధంగా అవతలి వారి పై విమర్శలు చేస్తూ ఉంటాడు.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వివాదాలు రావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇక తన ప్రేమ పెళ్లిల వ్యవహారంలో కూడా బాగా హాట్ టాపిక్ గా మారాడు.
ఇక మళ్ళీ మహాసముద్రం( Mahasamudram Movie ) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ సినిమా అంతంత మాత్రమే సక్సెస్ అయింది.ఇక ఇతడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.
తనకు నెగెటివ్ కామెంట్లు వస్తే మాత్రం తన నోటికొచ్చిన బూతులతో నెటిజన్లను తిడుతుంటాడు.
దీంతో సిద్ధార్థ్ కి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి బాగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి.
"""/" /
అయితే ఇదంతా పక్కన పెడితే.తాజాగా సిద్ధార్థ్ కార్తీక్ జి కృష్ణ దర్శకత్వంలో టక్కరి సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నాడు సిద్ధార్థ్.దీంతో ఇటీవలే ప్రెస్ మీట్ కండక్ట్ చేయగా.
అందులో రిపోర్టర్ సిద్ధార్థ్ ను.రీల్ లవ్ లో సక్సెస్ఫుల్ హీరో గా ఉన్న మీరు రియల్ లైఫ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు.
దానికి కారణం ఏంటి.దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా.
అని ప్రశ్నించాడు.ఇక వెంటనే సిద్ధార్థ్ కాస్త ఘాటుగా స్పందించినట్లు కనిపించాడు.
మళ్ళీ ఇలాంటి కామెంట్రీ అద్దం చూసి గాని నిద్రపోతున్నప్పుడు గానీ నా మైండ్ లో ఎప్పుడు రాలేదు.
ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నేను అలాంటివి ఆలోచించలేదు.ఆఫ్ కోర్స్ మీకు నా రియల్ లైఫ్ లో నేను ఎలా ప్రేమిస్తానన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు.
కాబట్టి మీరు నేను పర్సనల్ గా బయట కూర్చుని మాట్లాడుకుందాం.దీనికి ఈ ప్రెస్ మీట్ కి సంబంధం లేదు.
టక్కర్ సినిమాకు అసలే సంబంధం లేదు అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
ఇక ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
వార్2 సినిమాలో తారక్ డ్యూయల్ రోల్.. ఆ రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తారా?