సిద్దార్థ్ 'మహా సముద్రం' సినిమా చేయడానికి కారణం అదేనా ?
TeluguStop.com
సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే సత్తా చాటుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ ‘మహాసముద్రం’ అనే సినిమాని రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కించనున్నారు.
కాగా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.
ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ మూవీ ఈ నెల 14 వ తేదీన అభిమానుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఒక నాలుగు ఏళ్ల ముందు ప్రేక్షకులకు ఒక అనౌన్స్మెంట్ చేశాను.తెలుగు సినిమాకు మళ్ళీ వస్తున్నాను.
ప్రేక్షకులను రెడీ చేస్తూ, అలరిస్తూ నేను వస్తున్నాను అని చెప్పాను.కానీ కరెక్ట్ కథ నాకు దొరకలేదు.
ఎందుకంటే ఇప్పటివరకు లవర్ బాయ్ గా, చాక్లెట్ బాయ్ గా చేసిన సినిమాలు చూశారు.
దాని కంటే విభిన్నంగా కథ ఉండాలి .అది నాకు కమ్ బ్యాక్ లా కాకుండా, ఒక రీ లాంచ్ గా ఉండాలని వెతుకుతున్నపుడు ఆర్ ఎక్స్100 తర్వాత భూపతి వచ్చి ఒక కథ చెప్పాడు.
కథ వినగానే నేను ఈ సినిమా చేస్తున్నాను అని తాను చెప్పినట్టు హీరో సిద్దార్థ్ తెలిపారు.
"""/"/
తర్వాత చాలా వెతకడం జరిగింది.నాకెప్పుడూ స్క్రిప్ట్ మీద నమ్మకం.
నాకు స్క్రిప్ట్ అనేది ఫస్ట్ హీరో అని ఆయన అన్నారు.నా స్క్రిప్ట్ ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ సెకండ్ స్టెప్ అని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో అజయ్ తో పాటు, మంచి స్క్రిప్ట్ కూడా దొరికిందని సిద్దార్థ్ అన్నారు.
"""/"/
నిజంగా తాను మహా సముద్రం సినిమా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.
ఇది ఒక హీరో ఫిల్మ్ కాదు.ఒక వ్యక్తి ఫిల్మ్.
ఇది నిజంగా జరిగే ఒక కథ.ఎంటర్ టైనింగ్ ప్లాట్ ఫామ్ లో ఉంది.
ముఖ్యంగా తాను ఇప్పటి వరకు తెలుగు ఆడియెన్స్ ముందు చేయని ఒక పర్ఫార్మెన్స్ .
ఇప్పుడు అది చేయడానికి ఒక అవకాశం వచ్చిందని ఆయన వివరించారు.ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
కాబట్టి ఈ ఫిల్మ్ ఎందుకు చేశానో తనకు మాత్రమే తెలుసని సిద్దార్థ్ అన్నారు.
అక్టోబర్ 14న విడుదల కాబోయే ఈ సినిమా పై సిద్ధార్థ్ ఎన్నో నమ్మకాలను పెట్టుకున్నారు మరి ఆ నమ్మకం నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
జానీ మాస్టర్ కు కౌంటర్ ఇచ్చిన శ్రేష్ట వర్మ.. ఆ కామెంట్లపై క్లారిటీ వచ్చేసిందిగా!