సౌత్ ఇండియా హీరో సిద్ధార్ద్ ఈ మధ్య బీజేపీని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో తన మాటలతో వేడి పుట్టిస్తున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ ని కట్టడి చేయడంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని ట్విట్టర్ లో కామెంట్స్ చేసి కయ్యానికి కాలు దువ్వాడు.
ఇప్పటికే చాలా మంది కోలీవుడ్ యాక్టర్స్ బీజేపీ పార్టీ విధానాలకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు.
దీనిలో ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటారు.ఇప్పుడు సిద్దార్ద్ కూడా ఫ్రేమ్ లోకి వచ్చి వారిపై విమర్శలు మొదలు పెట్టాడు.
ఇదిలా ఉంటే బీజేపీపై కామెంట్స్ చేసిన తర్వాత తమిళనాడు బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ లీక్ చేసిందని, దీని వలన తనకి, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ విపరీతంగా వస్తున్నాయని ట్వీట్ చేశారు.
ఒక్క రోజులో 500 మంది ఫోన్ చేసి తనని చంపేస్తామని, తన ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని పోస్ట్ చేసి ఆ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్యపై సిద్దార్ద్ సంచలన కామెంట్స్ చేశాడు.
సిద్దార్థ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ యంగ్ ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి.
టెర్రరిస్ట్ కసబ్ కంటే అతను ప్రమాదకారి.దశాబ్దకాలపు ముందు వ్యక్తి.
ఈ ట్వీట్ ను షేర్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు.సిద్దార్థ్ ట్వీట్ పై బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు.
రాజకీయ భావజాలం భిన్నంగా ఉండొచ్చు కానీ సిద్దార్థ్ వాఖ్యలు అంత సమర్ధనీయం కాదని, అతని దూకుడు తగ్గించుకుంటే బెటర్ అని హితవు పలికారు.
మరి బీజేపీతో కయ్యాన్ని సిద్దార్ద్ ఎంత వరకు కొనసాగిస్తాడు అనేది వేచి చూడాలి.