హీరో సిద్ధార్థ్ దర్శకుడిగా పని చేశారా.. ఏకంగా ఆ స్టార్ హీరోని డైరెక్ట్ చేశారా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సిద్ధార్థ్( Siddharth ) ఒకరు.

ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలకు పెద్దగా తెలుగులో ఆదరణ రాలేదని చెప్పాలి.

ఇక చాలా రోజుల తర్వాత సిద్ధార్థ నిర్మాతగా మారి చిన్నా ( Chinnaa ) అనే సినిమాని నిర్మించారు.

ఈ సినిమా తమిళంలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో తెలుగు మలయాళం కన్నడ భాషలో కూడా ఈ సినిమాని విడుదల చేశారు.

"""/" / తెలుగులో కూడా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా హీరో సిద్ధార్థ్ బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా బిగ్ బాస్ వేదికపై ఈయన మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.నాగార్జున ( Nagarjuna )సిద్ధార్థ్ తో మాట్లాడుతూ ఇలా ఉన్నఫలంగా నిర్మాతగా మారడం వెనుక ఉన్న కారణం ఏంటి అంటూ ప్రశ్నించారు.

అయితే తనకు కొంతమంది మహానుభావులు ఎప్పటికైనా నేను సినిమా చేయాలి అంటూ అప్పుడు ఆశీర్వదించారు .

వారి ఆశీర్వాదము మేరకే నేను నిర్మాతగా మారానని తెలిపారు.ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చినది మరెవరో కాదు స్వయానా అక్కినేని నాగేశ్వరరావు( ANR ) కావటం విశేషం.

"""/" / సిద్ధార్థ్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ గారితో నేను చుక్కల్లో చంద్రుడు సినిమా( Chukkallo Chandrudu ) చేసే సమయంలో సార్ గారు ఒకరోజు నువ్వు ఎప్పటికైనా నిర్మాత దర్శకుడిగా కూడా మారతావు అందుకు సిద్ధంగా ఉండాలి అంటూ ఆశీర్వదించారని చెప్పారు.

మరి నాన్నగారు చెప్పినట్టు నిర్మాతగా మారావు మరి దర్శకుడుగా ఎప్పుడు మారుతావు అంటూ నాగార్జున ప్రశ్నించడంతో తాను ఎప్పుడూ దర్శకుడిగా మారిపోయాను అంటూ సిద్ధార్థ్ తెలిపారు.

చుక్కల్లో చంద్రుడు సినిమా షూటింగ్ సమయంలో మా డైరెక్టర్ గారు రాకపోవడంతో ఒక రోజు నేను డైరెక్షన్ చేశాను ఆ డైరెక్షన్లో భాగంగా ఏఎన్ఆర్ గారిని యాక్షన్ కెమెరా స్టార్ట్ అంటూ ఒకరోజు మొత్తం నేనే డైరెక్ట్ చేశానని ఆ కోరిక కూడా తీరిపోయింది అంటూ ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా ఒకరోజు తాను చుక్కల్లో చంద్రుడు సినిమాకు డైరెక్టర్ గా మారి ఏఎన్ఆర్ గారిని డైరెక్ట్ చేశానని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

చూస్తుండగానే 25 మంది విద్యార్థులు బస్సులోనే సమాధి..