సినీ పరిశ్రమను వేధించడం ఆపండి.. ఆ ప్రభుత్వంపై సిద్దార్థ్ ఘాటు వ్యాఖ్యలు!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో థియేటర్ల టికెట్ రేట్లను ఊహించని స్థాయిలో తగ్గించిన సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించడంపై మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తగ్గించిన టికెట్ రేట్ల వల్ల నిర్మాతలు మాత్రం భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల గురించి స్పందించగా తాజాగా సిద్దార్థ్ ఈ ఘటన గురించి వరుస ట్వీట్లు చేశారు.

విదేశాలలో తాను తొలిసారి 25 సంవత్సరాల క్రితం సినిమా చూశానని స్టూడెంట్ ఐడీ కార్డ్ సహాయంతో సినిమా చూసిన సమయంలో టికెట్ ధర 200 రూపాయలు అని సిద్దార్థ్ పేర్కొన్నారు.

ఇతర దేశాల టాలెంట్ కు తీసిపోని విధంగా ప్రస్తుతం మన దేశంలో నిర్మిస్తున్న సినిమాలు ఉన్నాయని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాలకు, పొలిటీషియన్స్ కు సినిమా టికెట్ రేట్లపై, పార్కింగ్ రేట్లపై ఎటువంటి హక్కులు లేవని సిద్దార్థ్ వెల్లడించారు.

"""/" / మద్యం, పొగాకుకే సినిమాల కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.

పరిశ్రమను నమ్ముకొని ఎన్నో వేల మంది జీవనం సాగిస్తున్నారని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.సెన్సార్ విషయంలో, పన్నుల విషయంలో ప్రభుత్వాలు ఏం చెప్పినా వింటామని సిద్దార్థ్ అన్నారు.

నిర్మాతలకు, నిర్మాతల దగ్గర పని చేసే ఉద్యోగులకు జీవనోపాధి లేకుండా చేయవద్దని సిద్దార్థ్ కోరారు.

"""/" / సినిమా బడ్జెట్ అనేది డైరెక్టర్, ప్రొడ్యూసర్ పై ఆధారపడి ఉంటుందని సిద్దార్థ్ తెలిపారు.

సినిమాల ద్వారా వచ్చే సంపాదన గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని సిద్దార్థ్ వెల్లడించారు.

తాము రైతులంత గొప్పవాళ్లం కాకపోయినా మేము కూడా మనుషులమే అని పన్ను చెల్లింపుదారులమని సిద్దార్థ్ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం పేరు ఎత్తకుండా పరోక్షంగా సిద్దార్థ్ చేసిన కామెంట్ల గురించి ఏపీ పొలిటీషియన్స్ స్పందిస్తారేమో చూడాలి.

Chandrababu : ఏపీని కాపాడుకునేందుకే టీడీపీ పొత్తు..: చంద్రబాబు