సీఎం కేసీఆర్ ని ఆహ్వానించిన హీరో శర్వానంద్..!!

టాలీవుడ్ హీరో శర్వానంద్( Hero Sharwanand ) అందరికీ సుపరిచితుడే.ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వెండితెరపై అలరిస్తున్న శర్వానంద్ జూన్ మూడవ తారీకు రక్షిత రెడ్డినీ( Rakshita Reddy ) పెళ్లి చేసుకోవడం జరిగింది.

హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డి.అంతేకాదు మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు కూడా.

కాగా జైపూర్ లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు.

ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కొంతమంది మాత్రమే హాజరవ్వడం జరిగింది. """/" / ఈ క్రమంలో ఈ నెల 9వ తారీఖున హైదరాబాద్ లో శర్వానంద్ గ్రాండ్ రిసెప్షన్( Sharwanand Reception ) ఏర్పాటు చేశారు.

దీనికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉన్నారు.దీనిలో భాగంగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను( CM KCR ) హీరో శర్వానంద్ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానం అందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.శర్వానంద్ తో కాసేపు ముచ్చటించారు.

ఈ ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.శర్వానంద్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది.

మీ అతి తగలెయ్య.. సిగిరెట్ ను ఈఎంఐలో అమ్మడమేంటి? వీడియో వైరల్