రవితేజకు ధైర్యం చాలడం లేదు.. ఈసారి రెండు నెలలు ఆలస్యం

రవితేజ హీరోగా కెరీర్‌ కు ముగింపు చెప్పాలిన సమయం వచ్చినట్లుగా కనిపిస్తుంది.రవితేజ ఈమద్య కాలంలో వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌లనే చవి చూస్తున్నాడు.

రాజా ది గ్రేట్‌ తర్వాత రవితేజ మళ్లీ మంచి టైం వచ్చిందని భావించాడు.

కాని ఆ వెంటనే ‘టచ్‌ చేసి చూడు’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.ఇక ఆ తర్వాత వచ్చిన ‘నేల టికెట్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాలు కూడా ఫ్లాప్‌ను మూట కట్టుకున్నాయి.

ఇలాంటి సమయంలో రవితేజ తదుపరి చిత్రానికి ఓకే చెప్పేందుకు భయపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాపై రవితేజ చాలా నమ్మకం పెట్టుకుని చేశాడు.

ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో తదుపరి చిత్రం ‘డిస్కోరాజా’ విషయంలో చాలా జాగ్రత్తలు పడాలని భావిస్తున్నాడు.

అందుకోసం స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పులు చేయిస్తున్నాడు.ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా విభిన్నంగా సినిమాను చేద్దామని దర్శకుడు విఐ ఆనంద్‌తో చెప్పడంతో ఆయన మళ్లీ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సినిమాను ప్రారంభించాలనుకున్న రవితేజ ఇప్పుడు ఫిబ్రవరికి సినిమాను వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ సరసన ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు.

వారిలో ఒకరు పాయల్‌ రాజ్‌ పూత్‌ ఫైనల్‌ అవ్వగా రెండవ హీరోయిన్‌ పాత్ర కోసం ట్యాక్సీవాలా ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

భారీ స్థాయిలో కాకుండా చిన్న బడ్జెట్‌తోనే ఈ సినిమాను నిర్మించేందుకు రవితేజ నిర్మాతలకు సలహా ఇచ్చాడు.

ఫిబ్రవరిలో అయినా సినిమా మొదలయ్యేనా లేదంటే ఇంకా సమయం తీసుకుంటాడా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

రవితేజ ఈ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.